పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యను తాత్త్విము . యనక తప్పదు. నిజజాతీయతత్వము బోధపడిన వెనుక అన్య భాషాపరిచయము పరిజ్ఞానమునకు మెఱుఁగిడు నేగాని, దత్పూర్వ ము జాతీయ పరిజ్ఞానాంకురములను మొదలంట గిల్లి వేయును. కావున ప్రతిమనుజునకును జాతీయవ్య క్తిజ్ఞానములవడు నఱకును దేశభాషయే కఱపవలెను. పిమ్మటనై చ్చికముగాను, అభిమాని కముగాను విదేశ భాషల నేర్పినను వ్యక్తిస్వాస్థ్యమునకు సంక టము గలుగనేరదు. లాభమును చేకూరురు. ఇదియే భాషాభ్య సన త త్త్వము. ఇందొకరహస్యము గలదు. అభ్యసింపబడు భాష రాజ భాషయైనచో నందలి ముప్పుమెండు. రాజ్య కార్యనిర్వహణమును కై రాజులు తమభాషయందు నిపుణులైనవారికి ఉన్న తోద్యో గములొసంగి గౌరవించి, బిరుదులు కొసగుచుండ స్వదేశ భాషా పండితులు నిరుత్సాహులై కాలక్రమమున భాషాభిమాన మును పోవిడుతురు. రాజ భాషయన్నంతమాత్రముననే, రాజ నామసమోహమున దానియందాదరము జనించుచున్నది. అట్టి ఆదరమునకుఁ దోడు, రాజభాషా పండితులు బహుమానములు బడయ ఆయాదరము గౌర మై, రాజ భాష యొక దేవ భాష యనియు, దేశ భాష ప్రాకృతుల భాషయనియు, దేశ భాషాపండితులు మనుష్యమాత్రు లై యుండ రాజభాషాపండితులు అతిమనుజు లనియు, భ్రమయొకటి కలుగుచున్నది. ఇట్టి భ్రమకు కేవలము దుర్మోహమే కారణము. జనసామాన్యమునం దీదుగ్మోహము గలుగుటయు, ఉగ్గుపాలతోటి పర భాష నేర్చుట చే జాతిస్వభావ మెఱుఁగక నేరక జాతియందు స్నే హార్ద హృదయులు కాజాలక,

ఆంధ్రమహోద్యమ త త్త్వము, అన్యాదర్శములస్వీకరించి, అన్యమార్గావలంబులై అన్య దేశీయ తుల్యులకు నీరాజభృతకులు, ముత్యపుచిప్పలన్నియు నొక్క చోటను గులన్నియు నెుక్క చోటన న్నట్లు, ఒక్కెడ జేరి అధికార రోగ పూరితులగుట, జనసామాన్యమును తృణీక రించి నిరసనభావముతో జూచి తమ్ము గౌరవించుకొనుటయు, రాజు భాషాభిజ్ఞులకును, తదితరులకును, అత్యంత అంతర మేర్పడుచున్న ది. ఇట్లు కేవలము కృత్రిమమై, దుర్మోహమాత్రమున నేర్పడిన . ఈ యంతరముచే ప్రాధాన్యముననుభవించు విదేశ భాషాపండి తులు తములగుఱించి నాగరకులనియు, జనసామాన్యమును గుఱించి మూఢులనియు, ప్రాకృతులనియు ప్రవర్తనము చేతను, సంభాషణల చేతను, దుర్వి చేష్టల చేతను వాడుకొనుటచే అశక్తు. లును, అధికారవిహీనులును, నిరుత్సాహులున గుజనులు తమ్ము మూఢులనియేనమ్మి మఱింతదుర్మోహమునకు లోఁబడుదురు. ఈ ఈ దుర్మోహ ప్రభావమున, భ్రమరకీటన్యాయమున జనులు వా స్తవముగా మూఢులగుదురు. అప్రయోజకులును, కార్య మునం దసమర్థులును అయ్యెదరు. ఇట్టిదుర్మోహమునుగుఱించి యెంత జెప్పినను దాని ప్రభావము మనోగో చరమగుట దుస్సా ధ్యము. దానినిగొంత వివరించెదము. పాఠకమహార్యులు విష యాంతరాతిక్రమణము సహింతురుగాక. ' మానవునకుంగల యజ్ఞానమే మోహమనిపించుకొనును గదా? తానెంతయో తన బలమెంతయో యథార్థముగా నెఱుఁ గుట జ్ఞానము. మజ్ఞానము, లేక మోహము. తాను విను విపరీత మాటలం బట్టియు, ఇతరుల బోధలం బట్టియు ప్రతిమానవునికిని