పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

25 ఆంధ్రమహోద్యము తత్త్వము. స్థులును, వారితో సమానవిద్యావంతులగు ప్రభుత్వము వారును స్వస్వలాభమునుగోరువారై ఈ దేశీయుల కాంగ్ల భాషగఱపుటకు సమకట్టిన వెనుక దేశము నంగలిగిన యవర్థము లపారములు. స్వజాతిద్వేషము, స్వమతగర్హణము, స్వభాషానిరసనము, స్వ వేష వైషమ్యము, స్వబుద్ధి పారతంత్ర్యము, స్వధైర్యత్యాగము స్వత్వనాశమును సంభవించినవి. ఉగ్గుపాలు ద్రావు కాలము మొదలుకొని ఇంగ్లీషుపుస్తకములును, వారిచేనియమింపబడిన తెనుగుపుస్తకములును చదువు బాలురకు, దురభిప్రాయములు శిలాక్షరములై వారిమనంబులనిలుచును. దినదినము ఉపాధ్యా యులు మన పెద్దవారి మూర్ఖత్వమునుగుఱించి, వారి ఛాంద స మునుగుఱించియు నుపన్యసింపుచుండును. మిషనరీ పాఠ శాలల యందు బైబిలు సయితము చదివింతురు. ఇంతకన్న జాతిహత్య వేఱుగలదా? అన్యమత యోధులగు మిషరీవీరులు తమకుసమా నులై వేదాంతశాస్త్రవేత్తలగు పండితులతో మతయుద్ధముజఱి గింపవలయునా? లేక చెప్పినదెల్ల నమ్ము బాలురతో తమయ కృత్యము బూనవలయునా? తన దేహబలము నిరూపించుటకై మన గ్రామమునకువచ్చిన మల్ల వీరుఁడు మన గ్రామమున మల్లు 3 రెవ్వరైనరాయని విచారించును. ఎవరైననున్న వారిని లడా యికి పిలుచును. లేనిచో యు థేష్టముగాజనును. కాని గ్రామ బాలురతో తన బాహుబలమునకుం బని బెట్టునా? దేహబల విష యమునంగల న్యాయము బుద్ధిబల విషయమునం జెల్ల దా? అది యేమికర్మమో, క్రిస్టియను మిషనరీల విషయమున చెల్లదు. పూ ర్వము మనదేశమున మతస్థాపకులగుశంకరుఁడు మొదలగు వారు దిగ్విజయము చేసినపుడు అనేక నగరములకుంబోయి మండన

ఆంధ్ర మహోద్యమ తత్వము. మిశ్రాదులతో వాగ్యుద్ధము బెట్టుకొని వారిని జయించిరి కాని గ్రామ బాలురకు బైబిలు చెప్ప లేదు. ఇపుడు క్రిస్టియనుమిషన రీలు అటుకాదు. ఎక్కడవిద్వాంసులు లేరో అదివారికు తమస్థ లము, ఎనరువిద్యాహీనులో వారు మతబోధకర్హులు. ఇట్టివారి వర్తనమునంగల జ్ఞానభీరుత్వము మిక్కిలగర్హ్యముగదా! అయి నను వీరు మన బాలుర కుగ్గుపాలతో పోసిన విదేశ భావములు మన దేశీయ సంస్థితికి వేరు పుఱుగులై తొలుచుచున్నది. మంది అనిన దేదైనను మనవారికిపుడు కంటగించుచున్నది. స్వదేశి తత్వమును చర్చించుచో భారతీయులలోనగణ్యుడఁగు ఆనంద. కె. కుమారస్వామి గారిట్లు వ్రాయుచున్నారు ' ఆంగ్లవిద్యాధికులమ నుకొను మనమే, మహాసభల నలంకరించుమనమే, ఆనుశాసనిక సభల జోక్యముపుచ్చుకొను మనమే, జమానుల నేలు మనమే, న్యాయస్థానముల నధిక వరుమానములనార్జించు మనమే, అకా రణముగ హైందవమైనప్రతిదానిని ద్వేషించి గర్హించుచున్నా రము. ఇట్టిద్వేషము చేతనే మనము హైందవశిల్పుల నధఃపతి తులగాఁ జేసితిమి. తప్పుమనయందుండెనని మనము తెలియ నేరక పోతిమి. ఆంగ్లేయవాస్తుశాస్త్రముసనుసరించి కట్టిన గృహములలో తప్ప నివసింపక పోతిమి. నవనాగరకతాయని మెడపట్టలును (Collers) మెడకుచ్చులును (Neckties) ధరించితిమి. కలెక్టర్ల బంగ ళాలదర్వాజలలో కూర్చుండుట గౌరమని భావించి అట్లా నర్చీతిమి. కుర్చీల పై గూర్చుండి చంచాలతో భుజించుట నేర్చితిమి. ' ఇంక నాగరకత, అభివృద్ధి పేరుబెట్టి ఎన్ని యో అసంభావ్యపు కార్యముల నొనర్చితిమి. ఇవన్నియు దేనిఫలములు? స్వజాతి వ్యక్తిజ్ఞానము కుదరకమునుపే అన్యభాషను పఠించుట చేత నే