పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యడు తత్త్వము. ఆదినుండియు విజాతివిద్య నారంభించినవారి దుర్నీతి వర్ణించుట కడుంగడ దుఃఖకరము. తమ పెద్దలమర్యాదలు, వారిజ్ఞానము వారి చరిత్ర వీరి కెంతమాత్రమును దెలియదు. వారు నేర్చుకొను జ్ఞాన మన్య దేశీయులదే. వారికి తెలిసిన జ్ఞానులు, కవులు, విద్వాం సులు అన్య దేశీయులే. ప్రస్తాపనవశమున వారుప్రయోగించు చమత్కార వాక్యము లన్య దేశీయములే. వారిహృదయమున అన్య దేశీయపద్ధతులే. నిరంతర సాంగత్యముచే వారి హృదయమందు జనించు విద్యావిషయికమగు నభిమాన మంతయు అన్య దేశీయులయందే. ఈచిన్న సందర్భమునుఁ జూడుఁడు. మనదేశమందు గణుతి కెక్కినట్టియు, సర్వశాస్త్ర పారందృశ్వినులగునట్టియు సంస్కృత పండితులెందఱో యుండ దేశమున “యత్రవిద్వజ్జనోనా సి। పూజ్య సత్రాల్ప ఐరోపా ధీరపి! నిర స్తపాద పేదే శే|| హేరండో పద్రుమాయతే" అన్నట్లు మేకపోతు గాంభీర్యముదాల్చి సంస్కృతమును ఆంగ్లేయ జర్మను భాషలలో వ్యాఖ్యానము చెప్పునట్టి 'యూరోపియ న్ స్కాలర్ స్'వద్ద మనవారికి సంస్కృతమందు యోగ్యతాపత్ర ములు కావలసివచ్చినది. క్రొత్తయొక వింత ప్రాతయొక రోత గదా! ఈ దేశ పువిద్యలు మిథ్యలు. వాల్మీకి వ్యాసకాళిదాసాది కవులు మన దేశములోనుండిన సంగతియే వారికి తెలియదు. అధవా తెలిసినను కాళిదాసా is the Shakspeare of India' అని (Shakspeare) షేక్ స్పియర్ కు రొమ్ములవఱకువచ్చునా, బుజములవఱకువచ్చునా? అని సరిజూచినగాని కాళిదాసుని నాట కళళావైదుష్యమును, అలంకార సౌమమార్యమును వీరికి మనో గోచరముకాదు, తృప్తియునులేదు. (Telegue is the Italian ఆంధ్రమహోద్యమ తత్త్వము, 93 of the East.) అని చెప్పినంతవఱకును వారికి తెలుగు భాష గొప్పదనము భావవీధిఁ గన్పట్టను. మనవస్తువులలో నే దాని యొక్క అంతస్సారము కనుగొనవలెనన్నను యూరోపులో దానికి సరియైనదానిని మానముగాఁగొని దానితో పోల్చిచూచిన గాని వారికి దాని వెల తెలియదు. మఱియు, అజ్ఞాత నాముఁడగు బియొవుల్ప్ అనువాఁడు వ్రాసిన క్షుద్ర కావ్యము రామాయణ మహాభారతములకం టె స్తుతిపాత్రము. ఛాసరు వ్రాసిన చిట్టెలుక కోడిపుంజుకథలు కథాసరిత్సాగరముకంటే ప్రీతిపాత్రములు. దేవాలయములు నింద్యములు. అచట నటవిట గాయకులు చేరు దురు. చెర్చెస్ శ్రేష్టములు. అచ్చట మ్యూసిషన్, లవర్స్ డాక్సర్'స్ చేరుదురుగదా! సౌందర్యసారము ఈ దేశ స్థులకు బాగుగా తెలియదు. సౌందర్యశాస్త్రము వీరభ్యసించియుండ లేదు. వీనిలో నేదైన బాగుగనున్నదని యూరోపియను డెవ్వ డైనఁ బల్కినయెడల నదిమాత్రము గౌరవనీయము. ఇచ్చట నుఁడు గొప్పవిషయములు వారు కనిపెట్టవలయును. గొప్ప వారిని వారంగీకరింపవలయును. తనతండ్రి ప్రతిదినము వేద మంత్రములు పఠించుచుండినను, బాలుడు “Max Muller discovered the Veda" అను వాక్యమును రోకటిపాట చేయు చుండవలయును. ఆ వేదమునకు మనకు నెంతదూరమో! దానిం గని పెట్టుట కొంత శ్రమపడవలయునో! ఎంత మహోపకారి యీy Max Muller ? స్వజాత్యౌన్నత్యమునందును, స్వదేశ గౌరవమునందును విస్మృతిమాత్రముగలిగిన కొంతమేలు. ప్రస్తుతము మనదేశము నకు మహోపకారము చేయుటకు వచ్చిన మిషనరీలు, వారిమత