పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యము తత్త్వము. అంగ సంస్థానము సజీవము కానేరదనియు, అట్లు నాటుటకు సం పూర్ణమైన ఆత్మజ్ఞానమలవడవలెననియు ఆత్మజ్ఞానములవడుటకు సమాధియే నూర్గమనియు పైన జెప్పియుంటిమి. కాబట్టి, మన యరవసోదరులును, కర్ణాటసోదరులు, మనమును నిజమైన ఐకమత్యముగలిగి మన వ్యాపారములయందు సజీవముగాను, వివేకముతోడను వర్తింపవలెనన్న నీమూడుజాతుల వారును అన్యోన్యమువీడి జాతిసమాధిచే ఆత్మసత్వములను, ఆత్మధర్మ ములను ఎఱుఁగవలెను. అటుపిమ్మట ఐకమత్యము సాధ్యపడునే . కాని ఇప్పటి మన సన్నిహితవ్యవస్థయు, యాదృచ్ఛిక సంయోజ నమును అన్యోన్య వైషమ్యములకును, జాతిపరస్పరహింసలకును మనల నీడ్చుకొనిపోవుచున్నది. అన్ని పక్షముల వారికిని క్షేమక రంబగు నీ విభజనమూలమున ఈజాతులవారికి పరస్పర స్నేహ భావము పెరుగఁగలను. మఱియొకవి శేషము, జాతీయాభివృద్ధి జాతీయమార్గము నే సమకూరవలెనుగాని అన్యజాతిమార్గముల కాదని చెప్పి యుంటిమి, అన్యజాతిమార్గములు, అన్యజాతిమనస్సరణీయు అవ లంబింపబడి భాషావ్యక్తిని జాతివ్యక్తిని వినాశన మొందించును. అన్యజాతిమార్గములు అన్యభాషాభ్యసనము చే ప్రాపితముల గును. ఈ సందర్భమున అన్య భాషావలంబనము చేఁగలుగు లాభ నష్టములను సంపూర్ణముగ మనస్సునకు దెచ్చుకొనవలెను. అన్య భాషాగ్రహణము కొన్ని సమయలం దుపకారియేగాని మఱికొ న్నిటిలో వారింపరాని ముప్పును దెచ్చి పెట్టుచున్నది. అయ్యది. భాషాభ్యసనము చేయువారి మనస్తత్వము ననుసరించి యుండు ను. పులిపిల్లను కన్నెఱుగక పూర్వమే దెచ్చి గొర్ల తో బెంచినవీఱికి

ఆంధ్రమహోద్యను తత్త్వము. యగుచున్నది. స్వజాతిజ్ఞాన మలవడిన వెనుక దానిం దెచ్చి గొర్ల తోడ నే బెంచిన దినమునకొక గొఱ్ఱను భక్షించి స్వజాతివ్వక్తిని మఱింతబలపఱచుకొనును. అట్లే జాత్యభిమాన మంకురింపక పూర్వమే ఒక పసికూనను అన్యభాషయందు ప్రవేశ పెట్టినచో వాఁడు స్వజాతి వ్య క్తి గోలుపోయి, అన్యజాత్యాదర్శమును స్వీక రించి పుట్టువుచే స్వజాతీయుడైనను వేష భాషల చేతను కార్య వ్యాపారములచేతను విజాతీయుఁ డగుచున్నాఁడు. అట్టివాఁడు కాళిదాసు చెప్పినట్లు “వర్ణమాత్రేణకృష్ణ” వర్ణము చేత నేనల్ల ని వాఁడు. అన్యతః పర దే యుఁడే. వానిమనస్సరణీయును మారి పోవును. అన్య జాతి పద్ధతులయందు గౌరవము హెచ్చను హెచ్చ ను స్వజాతిమార్గ ములయందును స్వజాత్యాదర్శముల యందును ఏవగింత వొడమును. యు క్తియు క్తములగువిషయములందు ఈ వై పరీత్యములు గాననగుట సరియేగదా, అట్లు గానిపట్ల సయితము ఈస్వజాతి సంప్రదాయ వైముఖ్యము సువ్యక్తమగుచున్నది. ఇయ్యది నేటిఆంగ్ల విద్యోపనీతులయెడ మెండుగ గన్పట్టును. వీరిలో నుత్కృష్టులు లేరని మాయాశయముగాదు. ఆంగ్ల భాషాధిగములలో విశేషభాగము స్వజాతివ్యక్తిని గోలు పోయినవారే. వారిమనస్తత్వ మెట్లుమారినది ఈచిన్న సందర్భ ములలో తెలియఁగలదు. ఏడవసంఖ్యను వర్ణించుట వారికి మిక్కిలి పరిహాసాస్పదముగా నుండునుగాని, పదమూడవ సంఖ్య (The unfortunate number) ను వర్ణింపకపోయిన వారికి గౌరహానియు, నాగరకతకు లోపమును. ఆదివారములయందు పనిపాటలు చేయకుండుట సుబోధ్యమేకాని, చతుర్దశి అమా వాస్యలయందు శెలవిడుటకు కారణములు దురూహ్యములు.