పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర హోద్యము తత్త్వము, పోషింపవలెను. దానికంతరాయమును గల్పించు అంశములు నెల్ల మిక్కిలి జాగ్రతతో తొలగఁద్రోయవలెను. అందువలననే మన జాత్యభివృద్ధికై మనము ద్రవిడులును వీడఁ గోరుట, వారి యభి వృద్ధికై మమ్ముపాయుమని వారిని ప్రార్థించుట. ఆత్మజ్ఞానమునకై పాటుపడు యోగీశ్వరు లేమి చేయు చున్నారు? ఆత్మ సర్వవ్యాపియనియు, దానికంటే వేరైనది లేదనియు గురుముఖముగా నెఱిగియు, అనుభవరీత్యా తెలిసి కొనుటకై., ఆత్మయేదనిపిచారించుచు 'ఇదియా? ఆదియా?' అని ప్రశ్నించి, ' నేతి నేతి' అనిదృశ్యప్రపంచమునంగల వస్తు వుల నెల్ల పరిత్యజించి తుద కేదియుఁ గానక యోగసమాధియం దన్యగ్రమస్కు లై కూర్చుండి ఆత్మంగని, సంపూర్ణముగ దాని స్వరూపము నెఱిఁగి సమాధినుండి జ్ఞాన సత్వముతో వెలువడి ఆత్మ సర్వవ్యాపియనియు, తానే సర్వమనియు నెఱిఁగి, భూతహితమే తనహితముగా నిర్ణ యించి లోకహితార్థమే జీవించుట లేదా? అట్లే ఆంధ్రజాతియు తనవ్య క్తిస్వరూపమును, సంపూర్ణ శక్తిని అనుభవము చే నెఱుఁగఁగోరి "మేము ద్రవిడులము కాము, మేము కర్ణాటులు కాము” అనివారినందరినుండి తాత్కాలికముగా వేర్పడగోరుట. యోగి ఆత్మజ్ఞానముగలిగిన వెనుక సమాధినుండి వెలువడి లోక క్షేమమునకై జీవించునట్లే, ఆంధ్రులును జాతి జ్ఞానమును జాతిసమాధిచే సంపాదించిన వెనుక అరవల క్షేమమే కర్ణాటుల క్షేమమే తమదని తెలిసి వారిహితమును సయితము తల పెట్టి తదరము తమప్రాణముల నర్పింపఁగలరు. ఆత్మజ్ఞాన సమా ర్జనకు సమాధియొక్కటియే మార్గమని వేదాంతశాస్త్రజ్ఞలు చెప్పుటలేదా? ప్రత్యేకవ్యక్తికి ఆత్మజ్ఞాన సమార్జమున కె య్యడి

ఆంధ్రమహోద్యను తత్త్వము. శాస్త్రమో, యేప్రక్రియయో, సమష్టివ్యక్తికిని అదేశాస్త్ర ము, అదేప్రక్రియ, కావున పైన వ్రాసినదంతయు కావ్యమును, అలంకారమును కాదు. శాస్త్రము. దీనం జేసియే ఆంధ్రులు ఇతరజాతులనుండి వేర్పడి జాతి సమాధియందు గూర్చుండ న లెను. అట్లే ద్రవిడులును, అట్లే కర్నాటులును. అట్లు జేసినగాని ఆయా జాతులవారికి వారివారి జాతిసత్వము అంగ సంస్థానమునంగల అంగములకు ఆత్మజ్ఞానముగలిగి ఆత్మసత్వము సంపూర్ణ విలసనమునొంది, అన్యోన్యావశ్యకత అనుభవపూర్వముగ మనస్సున నాటినగాని ఆయంగ సంస్థానము సజీవము కానేరదు. సజీవమగువఱకును అంగసంస్థానమునంగల అంగములు సన్నిహితవ్యవస్థ పరస్పరావరోధకమై రాపిడిచే కలహాగ్నుల ప్రజ్వలింపజేయును. మానవశరీరము సజీవముగా నుండునపుడు, కాలి క్షేమము నోరును, నోటి క్షేమము కాలును గోరుచు అన్యోన్యానుకూలతమై ప్రవర్తించు ఈయంగ సంస్థానమే, శరీరము నిర్జీవమై శుష్కించిన పిమ్మట అంగములొకటితో నొకటికొట్టికొని ఆ సంఘర్షణముచే కాలక్రమమున సశల్యముగా జీర్ణించిపోవును. కావున నిర్జీవమైన దేహమునందు అంగాంగ సన్నికర్షము ప్రళయమునకును, సజీవమైన దేహమం దదే అం గాంగసన్నికర్షము పరస్పరాకర్షణమునకును, ప్రేమానుబంధము సకును, ఐకమత్యమునకును హేతువు. కాబట్టి యే ఐకమత్య మునకు అంగాంగ సన్ని కర్షము చాలదు. అంగసముదాయమునకు జీవముకూర్పడియెడల అట్టి సాన్నిధ్యము చేటు దెచ్చును. అంగాం గపరస్పరావశ్యకత మనమున అనుభవపూర్వముగా నాటినగాని