పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. యేరాఁగలదు. కావుననే మనకు భాషానిల్లీ త రాష్ట్రము లే ఆదర్శ ములని వక్కాణింపవలెను. చేతనమునక ంగమైన ఒక అంతర్భాగమునకు తాను ఆచే తనముతో నొక్కటియను సమష్టిజ్ఞానమునకుదోడు స్వధర్మ జ్ఞానము సంపూర్ణముగ నుండుటయేకాక, స్వధర్మమును పాలిం చుటకు ఆవశ్యకమైన సంపూర్ణశక్తియు నుండవలెను. హైం దవవ్యక్తి కంగమగు ఆంధ్రజాతికిని అట్లే. లేనినాడు స్వధర్మ పాలనము దుస్సాధ్యమగును. అట్లు సంపూర్ణ వ్యక్తిజ్ఞాన మును, స్వధర్మపాలనాశ క్తియును సంపాదించుట కొఱకై ఆంధ్రులు వేరురాష్ట్రమును కోరునది. ప్రత్యేక రాష్ట్రమందై నచో జాతీయవ్య క్తిని సులభముగా నెలకొల్పనగును. (సంకర) రాజ్యమందీ కార్యము కొనసాగదు. జాతీయవ్యక్తి ఆయా జాతుల వారి మనస్తత్వమునుబట్టి వృద్ధిబొందును. జాతీయ మార్గముల ననుసరించియే నయ్యది పెంపొందును. పొగబండిని రైలువీధిపై నిలిపి ప్రేరేపించిన ఆకమ్ములనే అనుసరించి అదిగమ్య స్థానము చేరురీతిగ నే జాత్యుత్సాహము జాతీయమార్గ ములననుసరించునట్లు ప్రేరేపించినచో జాతీయవ్య క్తిని పెంపొం దించుకొనుచు గమ్యస్థానము చేరును. రైలుబండి కమ్ములను 'శకలములగు జాత్యుత్సాహమును తప్పిన నేలగూలి శకలములగునట్లే జాతీయమార్గ ములను విడిచిన జాతిభ్రంశమునకు హేతువగ్గును. ఇయ్యది నిజపంథానుసరణమున అంతరాయమును సహింపదు. అన్యజాతివ్యక్తి సంపర్కము చే నదిజాతీయమార్గముల ననుస రింపలేక వ్యగ్ధమై లక్ష్యముగాన లేక పోవును. లేదా, మాత్స్య

ఆంధ్రమహోద్యరు తత్త్వము, న్యాయమున నావ్యక్తికి చోటిచ్చి తాను స్వరూపనాశము 1 నొందును. ఇట్లు వ్య క్తివిసర్జనము, అన్య వ్య క్త్యవలంబనమును జాతివినాశన మాపాదించును. నిజమత సంస్కార మభివృద్ధికి మూలమేగాని, అన్య మతస్వీకారము జాతి ప్రళయసూచకము. అయ్యది మానవసమష్టి వ్య క్తిని మూల మంటద్రవ్వును, కీళ్లుకీర్లుసడల్చి ప్రచలనము సాధ్యము కానట్లు చేయును. అందుచే జాతియంకు కట్టుబాటులేక జాతి అయిం చును. అన్ని భాగములును సరిగానుండిన పనిచేయు యంత్ర ముందు కొన్ని భాగములు తమరూపముగాని, స్థానముగాని, వ్యాపారములనుగాని మార్చినచో ఆయంత్రమెట్లు పని చేయును? చతుష్పాత్తులను జూచి నాల్గు కాళ్లుండుటచే మృగములు ప్రాయి కముగా పడుటలేదు అనుసద్దేశముతో మానవుని దేహమందుఁ గల చేతులు సయితము నడచుటకు ప్రారంభించిన, వాఁడు చేయు పనులెట్లు కొనసాగును? కావలెనన్న సాధ్యమైనచో ప్రయత్న మున మఱి రెండు కాళ్ళుసంపాదించుటగాని, లేక ప్రస్తుతముండు పాదములు పెద్దవిగా చేయుటగాని యుచితముగాని, చేతులను కాళ్లుగామార్చుట పొఱబాటు. అదేరీతిగ మానవసమష్టి వ్య క్తి యందు నిజమత సంస్కార మొప్పునుగాని, అన్యమతావలంబ నము కూడని కార్యము. చేటు గూర్చును. కావుననే మహర్షులు “పరధర్మో భయావహః” అని చెప్పియున్నారు. మతమున కెట్లో జాతీయవ్య క్తికిని అట్లే. వ్యక్తి పరివర్తనము జాతీయ సంస్థితికి మూలచ్ఛేదకరము. కావున ప్రయత్నమున జాతీయవ్య క్తిని 1. Survival of the fittest in the struggle for existance- Natural selection: The bigger fish eating the small. 2