పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ త త్త్వము • వాదము లేనపుడు ' మాకువాదములేదు. ఐనను మామతము విడువుమ'ని చెప్పుట మేలుగాని, ఇట్లు దుర్మోహారోపణ. సేయుట యవివేకము, సమష్టి జాతిత్వమునకు జాతులే అంగములు. ఏలననగా చేతనమగు సమష్టి జాతికి అంతర్భాగములు పై తము చేతనము లుగానుండవలెను. అనగా అంగములుగా నుండవలెను. అంగ మనగానేమి? చేతనవ్యక్తియం దొకభాగమై, తదితర భాగములు కంటెభిన్న మైన ప్రత్యేక స్వరూపముగలిగి, తనయంత ర్భాగము లకు సంగాంగ సంబంధముగలిగి, ప్రత్యేక స్థానమును, ప్రత్యేక ధర్మమునుగలిగిన యొక అంతర్వ్యక్తి. ఈఐదింటిలో నెయ్యది కొఱతయైనను వస్తువు అంగము కానేరదు. చేతనవ్య క్తియందొక భాగము కాక తక్కిన నాల్గుధర్మములును గలిగియుండినచో నయ్యది ప్రత్యేకవ్య క్తియే యగును. అంగము కానేరదు. ప్రత్యే కస్వరూపమును స్థానమును లేనిచో ప్రత్యేకధర్మమును నిర్వ ర్తించుటకు వీలు లేక పోవును. అంగాంగ సంబంధము లేని చో చేతనము కానేరదు. కాబట్టి చేతనవ్య క్తిలో భాగము కానేరదు. ప్రత్యేకధర్మము లేనియెడల దానియునికి నిరర్థకము. కావున అంగమున కీయైదులక్షణము లుండవలెను. సమష్టి జాతియగు మన హైందవజాతిని మటేవిధమైన అంతర్భాగములుగా విభ జించినను పై లక్షణములలో నొక టేని కాక రెండేని కొరవ యగును. ప్రస్తుతము దక్షిణదేశముననుండునట్లు ఆంధ్రద్రవి డులసమ్మేళనము చే అంగలక్షణములలో మూడు లుప్తము లగుచున్నవి. అవియేవన ప్రత్యేక స్వరూపము మొదటిది. ఆంధ్ర ། వ్యక్తియొకటి అరవవ్యక్తియొకటి కలియుటచే నీ సమాజమున

ఆంధ్రమహోద్యమ తత్త్వము, కొక వ్యక్తియున్నదనుటకు వీలు లేదు. కాన ఈస మ్మేళనము వాస్తవముగా సమ్మేళనము కాక సంకరమై ఉభయపక్షములు వారికి నేవగింత పొడమున ట్లొనర్చును. ఇరుగడలవారికిని అప కారిణియగు నీసంకరముచే దీనియందు అంగాంగ సంబంధము సంపూర్ణముగా నుండఁజాలదు. ఈ సంబంధముకొర వడిన కార ణమునను ప్రత్యేక స్వరూపము లేమి చేతను ఈరాజ్యమువారు ప్రత్యేకధర్మమును నిర్వర్తింపలేకపోదురు. ప్రత్యేకధర్మము చేయుటకు పై జెప్పిన రెండును ముఖ్యాంశములు. అవి లేనినాడు. నిదియు నుండఁజాలదు. అందుచే నీ సంకరము అంగమునకు ఆవశ్యకమైన మూడులక్షణములను చంపుచున్నది. పైయైదు లక్షణములలో నేదేనిఒక్కటి లేక పోయినచో నయ్యది అంగము కానేరదని చెప్పియుంటిమి. అట్లుండ మూడు కొఱవయైన నీసంకరమును నేమనవలెనో తెలియకున్నది. ప్రత్యేకవ్య క్తులు గల రెండు అంగములను కలిపి ఆయోజనముచే రెంటియందును అంగత్వమును జంపి రెంటిని నిర్జీవముగా జేసిన నీ హైందవ వ్యక్తి కెంతన్యూనత గల్గుచున్నదో చేతనమగు చూడుఁడు. దేహమునం దెవ్వియేని రెండు అంగములు పక్షవాయువు దగిలి నిష్ప్రయోజనములైనట్లే. రెంటిని దెగనఱుకుదమన్న సాధ్య ముగాదు. అట్లే నిలుపుదమన్న వృధాభారము. వృధా భారము మాత్రమైన నోర్చుకొని యుండనగునుగాని వీనియుని కిచే దేహమురోగా విష్టమైనదని అనుక్షణమును వచ్చు జ్ఞాపకము ఇతర అంగములనుగూడ స్వధర్మపరాఙ్ముఖములుగ జేసి కొంచె ముకొంచెముగా తుదకు వ్యక్తిని సంపూర్ణముగఁ జంపును. హైందవజాతివ్యక్తి కిని ఇట్టియసంభావ్యపు విభజనలచే దురవస్థ