పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్వము. కాబట్టి హిందూ దేశమునకు సమష్టి జాతిత్వమే యాద ర్శము. ఆదర్శము దృష్టిముందు నిల్పిన పిమ్మట దానిని చేరుటకు సులభోపాయ మెద్దియని చర్చింపవలెను. ఈ సందర్భమున అనే కులు హైందవసంయు క్త రాష్ట్రములను గుఱించి ముచ్చటించియు న్నారు. కాని ఆయా దర్శము పొంకు మార్గమువిషయమై అంద రికినొక్క యభిప్రాయము లేదు. ఆయంశము నించుకైనను ఆలో చించిన వారెల్ల, భాషానీర్ణీతరాష్ట్రములే మన హైందవజాతీయ తకు అంగములు కాగలవని దూరదృష్టిని చూచియున్నారు. స్వార్థపరాయణులు, తాత్కాలిక లాభమును గోరువారును కాలక్రమమున తమకేది శ్రేయోదాయకమని గుర్తెఱుంగ లేని వారుకు కొందరు దీనిని ఖండించిరి. శత్రుపక్షము వా రిట్లు చెప్పుట సరియేగదా, మనవారు సైతము కొండఱిది సరియైన యాదర్శముగాదనియు, ఒక వేళ విధి లేక దానినొప్పుకొనవలసి' వచ్చినప్పుడు ఆంధ్రు లొక జాతివారు కాదనియు చెప్పుదురు. పై వాదము చేత మనకు సమష్టిజాతిత్వమే ఆదర్శమనియు, అద్దా నికి భాషానిర్ణీ తరాష్ట్రము లే అంగములనియు విశదమైయుండును. ఇక నిపుడు ఆంధ్రులొక జాతివారా కాదా అను విషయమును చర్చించవలెను. ఆసందర్భమున చారిత్రాత్మకమైన దృష్టాంత ములఁజూ మేము బూనుకొనలేదు. ఆంధ్రులలో కొందఱు రాష్ట్రము ప్రత్యేకముగా కోరుచుండ వారి యవివేకతకు విచా రపడి ' ఓ హెూ ! సోదరులారా! మీరు చెడిపోవుచున్నారు, మనకు ద్రవిడులతోపొత్తు ఎంతశ్రేయోదాయక మైనది మీరు 1 1917 నెల్లూరియందు జరిగిన రాష్ట్ర ప్రతివాదుల సభలో నొకరిట్లు జెప్పిరి

ఆంధ్రమహోద్యమ తత్త్వము, కనుగొనలేకున్నారు' అని వారిడు కుయ్యాలించిన వారెల్లరును వీరందఱును ఒకేజాతి వారని చెప్పకమానరు. అట్టివారి విచా రమే ఆంధ్రులొక జాతియని చెప్పక చెప్పినది. చేతన వ్యక్తి యం దుగల అంగాంగ సంబంధ మిట్టి దేక దా? వియోగము సహింపలేని ఈ సంబంధమే చేతన వ్యక్తి యొక్క చైతన్యమును చాటుచు న్నది. కాలిలో ములు గ్రుచ్చుకొనినచో చేతులూరకుండ జాలవు గదా ! అట్లే కంటికి దెబ్బదగిలినపుడు దేహము వేదనబొందు ను. ఈసంబంధము ప్రకటీభూతమగు వఱకును వ్యక్తి ఆరోగ్య ముతో మెలగు చేతనముగుచున్నది. ఆంధ్రజాతీయు వట్లే. కాబట్టి అట్లు విచారపడిన వారే చేత జేయుచు, వాచాలేదనుచున్నారు. దీనియందు మఱియొక ప్రమాదముగలను. అట్లు' 'నారో నరించు కార్యముయొక్క ఫల మించుకాలోచింపవలెను. అంత శ్చక్షులు కానివారితో మీ రించుకమాత్రులని చెప్పుట చాల పొఱబాటని మానసికశాస్త్ర యుద్ధోషించుచున్నది. వ్యక్తి విలసనము సంపూర్ణముగా లేనివాఁడుగాని, వ్య క్తివిలసనము సంపూర్ణముగా నుండినను స్వబుద్ధిచే సంగీకరించు వాఁడుగాని ఆరోపణవిద్యార్థి ప్రయోగమునకు సులభుఁడని ఆశాస్త్రవేత్తలు చెప్పుదురు. ప్రత్యేకవ్యక్తి కెయ్యది శాస్త్రమో, సమష్టి వ్య క్తికి నయ్యదియే శాస్త్రము. జాతియందు సంపూర్ణవ్యక్తి జ్ఞానము లేనపుడు దానియందు దుర్మోహారోపణము చేయ రాదు. వ్యక్తిజ్ఞానము లేనివారలతో 'మీకు జాతి లేదు. ఐతిహ్యము లే క్తిభ్రంశమునకు కారణము. కావున ద'ని చెప్పుట జాతివ్య 1. Organic relation. 2. Suggestion-Hypnotic suggestion. 3. Evil Hynotie suggestion.