పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ్ తత్త్వము. ముగాఁ గన్పట్టుచున్నది. వేయిగొఱ్ఱపిల్లలలో గలిసియున్నను తనశాబమును, శాబ్దము తనతల్లిని క్షణములో పృథః కరించుచున్నవి. అది యట్లుండినను ఒక మానవ సంఘమునకును, మఱియొక మానవసంఘమునకు నుండుభేదము సువ్యక్తము. చీనాదేశీయులను ఇండియా దేశీయులనుండి సులభముగ వేరు పఱుపవచ్చును. నీగ్రోలను ఇతర జాతులనుండి సులభముగా నేర్పఱుపున ఒక్క జాతిలోనే రెండుమూడు తెగలున్న యెడల కొన్ని సమయముల నట్టి తెగలను సులభముగ గుర్తింప వచ్చును. వ్యక్తి భేదమున్నను కొన్ని సామాన్యలక్షణముల చే భిన్నరూపులగువారిని జాత్యంతరముగ శాస్త్రకారులు గ్రహిం తురు. ఈవిచక్షణ స్థూలమైన దేశాని సూక్ష్మమైనదిగాదు. శమునందుగాని కొంతయైన సంకరము లేనిజాతి కన్పడకుండుటే ఈయభిప్రాయమునకు బలవదాధారము. జాత్య భిమానము చే విఱ్ఱవీరు నాంగ్లేయులు ఆంగ్లో సాక్సను నార్మనజాతులు కుద్భ వించిన మిశ్రజాతివారే. దీనియందు పిక్టుల యొక్క యు, ఐడిషు వారియొక్క యు సంకరము పూర్ణముగాఁగలదు. జర్మ కర్మనులయందు స్లావులు మొదలగు జాతులు కలిసియున్నారు. ఈ కాలపు గ్రీకుల కును పూర్వకాలపు గ్రీకులకును యెంతమాత్రము సంబంధమో స్పష్టముగా తెలిసియున్న ది. చీనా దేశీయులకు జపాను సంక రమును రుప్యాసంకరమును గలవు. ఈకాలములో బ్రిటనుయందు సయితము చైనా జపాను దేశీయులు బోయి తెల్ల వారిని వివాహ మాడి సంకరముల నేర్పఱచుచున్నారు. తెల్ల జాతి సంకరము మన దేశమున యూ రేషియనుల పేర ననేక తరగతులుగాఁ గన్పట్టు చున్నవి. ఈ విధమున నే దేశమునఁజూచినను కొద్ది భాగమైన

ఆంధ్రమహోద్యము తత్వము . సంకరముగా గన్పట్టుచుండగా ఆదేశీయులకందఱికిని ఏక జాతిత్వ మెట్లుఘల్లును ? శాస్త్రతః ఏక జాతిత్వము సమకూరదనుట నిస్సంశయము. ఐన నిదియాలోచింపుఁడు. తెల్లవడ్లలో నక్క డక్కడ కేడిపారుగింజలు గలిసియున్నను, వానిని తెల్లవడ్ల నుల కేమి ఆక్షేపణగలదు ? మానవులు మనీషావంతులగుట చే బహుజాతి సమ్మిళితమగు సంఘమునందు సైతము ఏక జాతి బుద్ధి అభిమానికముగఁ గల్పించుకొందురు. ఏక జాతిత్వము వస్తుతః అసాధ్యమగుట చేత ఏక జాతి బుద్ధి అర్థవిషయములు సమానదేశ స్థులకు ప్రధానమగుట చేతను అట్టియభిమానము ఆవశ్యకమై యున్నది. ఒక దేశమునందు నివసించుజనులను అన్య దేశస్థులు వలన రక్షించుటకై ఐకమత్యము గల్గించుకొఱకు వారందఱకు దేశ సామాన్యత చేగల్గు నభిమానమునకు తోడు జాతిసామాన్య త చేగల్గు నభిమానముగూడ సత్యావశ్యకమై యున్నది. హిందూదేశమందుగల అశేషజాతులకును ప్రభుత్వము ఒక్కట యనువంశముగూడ వారి కేక జాతిత్వము గూర్ప చాలదు. పూర్వము చంద్రగుప్తుఁడు, అక్బరు, కృష్ణ దేవ రాయులు పీష్వాలు మొదలైనవారి కాలములో భరతఖండ ములో విశేష భూమి ఒక్క ప్రభుత్వము క్రింద నున్నను, ఈఏక జాతిత్వ మెంతమాత్రమును సమకూరలేదు. ఈ ప్రభుత్వము వారి యాధి పత్యములోను అంతకంటె నెక్కువ కాఁజాలదు. ఎన్ని విధములను కృత్తిమసందర్భములు స్వాభావికశక్తులను నిర్మూలింపఁజాలవు. భాష జాతికి స్వాభావికశక్తి. అట్టిభాషా సత్వమును యాతాయాతనై జముగల ప్రభుత్వము నిర్మూలింప లేదు.