పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమీ తత్త్వము. ముననే ప్రతి హైందవునకును వీరు చునో వీధినిగాన్పించి మన ప్రస్తుతపుదై వ్యస్థితికి కన్నీరుగార్చు మొగంబులతో నొకరి వెనుక నొకరు చిత్రప్రదర్శనమునవ లె బొడసూపుదురు. పుణ్యనదులగు గంగా సింధు కృష్ణాకా వేరులు హైందవులయభివృద్ధికి మూల కందములై సర్వధా సంస్థూయమానములగుటచే వానినామ ములు హైందవసారస్వతములోనికి పెణుచుకొనియున్న వి. కావున జన సామాన్యమునకు ఐతిహ్యమును సామాన్యమే. కాని మనకు ఆచారములు భిన్నములు, భాషలు అనేక ములు. ఆచారము లెట్లున్నను, ఈభిన్న బాషత మన కేక జాతి త్వమునకు ప్రతికూలమై సమర్థి జాతిత్వమే ఉచితముగా నొనర్చు చున్నది. భాషయనగా జాతికి ప్రాణము. ప్రాణమువిడిచి దేహము బ్రతుకలేన ట్లే భాషను విడిచి జాతియును బ్రదుక లేదు. తల్లి ఉత్సంగ మొక వంకయ హేమాద్రిని మఱియొక వంక యును జూపి, నీ కేది కావలయునని శిశువునడిగిన అది హేమాద్రిని నిర సించి మాతృత్సంగమునే జేరుచున్నది. అట్లే సారస్వతరాజ్యోప భోగము నొకతల, త్రైలోక్యరాజ్యము నెకతల నుంచిన జాతి స్వాభావికముగా నే సారస్వతము పై పుననే తిరుగును. ఆంగ్లేయుని నిర్బంధించి నీ సామ్రాజ్యమును విసర్జించెదవా? లేక షేక్స్పి యరుమీ వాఁడు కాదని యెప్పుకొ నెదవా' అనియడిగిన వాఁడేది చేయునది చెప్ప నక్కరలేదు. ఒక్క షేక్స్పియరును వీడుట కే వాఁడింతకష్టపడునప్పుడు, అట్టివారిని వందలకొలది పోషింప శక్తిగలభాషను విడుచుట యెంత దుర్ఘటము ? కావున జాతి భాషను విడిచి బ్రదుక గలదన్న మాట అసంభవము. ఆంధ్రునకు ఆంధ్రమహోద్యమ త త్త్వము. ఆంధ్ర భాషవిడిచి పెట్టుటకంటె ఈయిండియా దేశమునకే కాదు, ఈలోకమునకు పై తము రాజీనామాయిచ్చుకొని పోవచ్చును. మనకిప్పుడు ఆచారములు భిన్న భిన్న ములుగా నున్నవి.. కాని భిన్నములయ్యు వానియం దొకసామాన్యత గన్పట్టు చున్నది. మనయాచారములకును యూరోపియనుల ఆచారము లకును తారతమ్యముజూచిన, వానికంటె నివిభిన్నములై ముత్యాలహారముసందలి ముత్యములు వేరు వేరయ్యు వాటిని గూర్చు సూత్రమొక్కటియే అగు విధమున సామాన్యాభి ప్రాయ ము గలవియును, సామాన్యా దర్శముగలవియునుగా గన్పట్టును. కావున మనకు ఏక జాతికి ప్రతికూలాంశములు గొన్ని యు అనుకూలాంశములు గొన్నియు. ప్రతికూలములగు అంశము లుండుటచే మన కేక జాతీయత తలపరాని దనియు, అను కూలములు కొన్ని ఉండుటచే సమష్టి జాతీయత గమ్యస్థాన ఉ మనియు యేర్పడుచున్న ది. ఇన్నిటికిని జాతిత్వము ఒక్క దేశము వారికైనను గలదా ? " అనువిషయ మించుక చర్చితము. సమాన దేహ లక్షణముగల వారొక జాతియనిస కేవలము సమరూపులగు పురుషులిద్దరు లోకములో నుండరనుట నిస్సంశయము. విశే షము పోలికగలవారియందును వారిని వేరు వేరుగా గుర్తించు టకూ దగినంతమాత్రము వ్యత్యాసముండనే యుండును. లోక మున సామాన్యముగా నట్లుండుట చేతనే వ్యవహారములు చక్కగ జరుగుచున్నవి. పశ్వాదులలో సయితము వ్యక్తి భేదము నిర్ణయించుట మనకు సుసాధ్యము. ఆపశువులకు మఱింత సాధ్య