పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. నది లేదు. నాల్గవదగు మమత్వము చేతనమునకును దానియొక్క అంతర్భాగమునకును గల సంబంధమునకు కారణము. యాదృ చ్ఛికముగా నలుగురు మనుష్యు లొకచో గూడినపుడు వారినల్లు రికిని మొదటిమూడులక్షణము లుండ వచ్చును. కాని కడపటిది లేనిచో వారి సమాజము ఒక చేతనము కాఁజాలదు. ఒక కుటుంబ ముననుండు వారలకు మొదటి మూడుండుటయేగాక, నాల్గవదగు మమత్వమునుగలదు. తండ్రి తనయుడు తనవాఁడనియు, భార్య భర్త తనవాఁడనియు స్వాభావికముగానే భావింతురు. కావున ఈమమత్వము కుటుంబమునందు అంగాంగ సంబంధమును కల్పించి, దానినెుక (సమష్టి) చేతనముగా జేయుచున్నది. హైం దవజాతికిని ఈనాల్గుల కణములును గలవు. కావున విజయు (సమష్టి) చేతనవ్య క్తి యే అగును. హైందవ జాతియం దాంధ్రులు, బంగాళీలు, అరవలు మున్నగు శాఖలవారు వైజస్వరూపములు తోనుండ,ఆయాజాతి పై సర్గిక స్వరూపములకూపు మాపి అశేష జాతులకు సాధర్మ్యముకల్పించుట హైందవ జాతి సుస్థితిని బాడు చేయుటయే. అందుచే మనప్రయత్నములన్నియు నేయే శాఖ వారి స్వరూపధర్మములను ఆయా జాతివారు పోషించుకొన జేయుటకు సహాయకారులుగా నుండవలెను. మనప్రస్తుత పరిస్థితులు కొంతవిచారించి మన కేక జాతీయ తగలదో, అయ్యది లేనినాడు సమష్టి జాతీయత మనకుగలుగ గలదో, సమస్థి జాతీయత గలుగవలసిన పక్షములో ఆంగ్లేయు లను, జపానుజాతివారినిసయితము కలుపుకొని మనమేల సమష్ఠి జాతీయత సమకూర్పరాదో తెలిసికొనవలెను. శాస్త్రవిదులు ఏక జాతీత్వమునకు ఐదంశములు ముఖ్యమని చెప్పియున్నారు,

ఆంధ్రమహోద్యమ తత్త్వము. (౧) దేశ సామాన్యత (౨) భాషాసామాన్యత (3) ఐతిహ్యము (ర) ఆదర్శసామాన్యత (1) ఆచారపరంపర. జాతిత్వమును పోషించు అంశము లితరములున్నను అయ్యవి ప్రాధాన్యమును బొందజాలవు, ఈ ఐదింటినిబట్టియు మన దేశ పరిస్థితులను చర్చించ వలెను. మనకు దేశసామాన్యతగలదు. ముక్కో ణాకృతిగల ఈవిశాలభూమి కిరుగడలను సముద్రమును, మూడవదగ్గు ఉత్తరపుడెల్లను దుర్గమములై, అభ్రంకమములగు హిమవత్ప ర్వతములును గలవు. కావున స్వరూపము చేతనే ఈ దేశ మొక్క జాతికి ఆశ్రయము గాఁదగియున్నది. ఈ దేశమందు జనుల కై తిహ్య యొక్కటియే. ఇదివరలో కన్నెఱుఁగనప్పుడు పరస్పర స్పర్ధ లెట్లుండినను, నేత్రోన్మీలనముకలిగి ప్రపంచమునంగల ఇతర జాతుల జూచిన పిమ్మట మనకు చరిత్రమంతయు సామాన్యమై మనమహాపురుషులు దేశ కాలనియతి లేక కొనియాడబడుచు న్నారు. పరాక్రమధుర్యులగు శివాజీ కృష్ణరాయులు అక్బరు మున్నగువారెల్ల స్మరణమాత్రమున మనయుల్లంబుల నుత్సాహ పూరితములుగ జేయ సమర్థులు. వాల్మీకి వ్యాస కాళిదాసాది సంస్కృతమహాకవులును, తిక్కన తులసీదాసు కం మున్నగు దేశీయకవిసింహులును, తమవాగమృతముల దేశము లందు వెల్లి గొలిపి అందరికిని పూజ్యులైరి. ఆనుశాసకులగు వేద మహర్షులును, గురువులగు వశిష్ఠ కణ్వాదులును, శాస్త్రకర్త లగు పాణిని కాత్యాయనాదులును, మతస్థాపనాచార్యులగు బుద్ధ శంకరరామానుజ నానకాదులును, సంఘసంస్కర్తల గు ఆపస్థంభకుమారిలాదులును, హైందవ దేశమున కంతయు మహోపకారులును, వంద్యులును, వీరి నెల్ల స్మరించినమాత్ర