పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర మహోద్యమ తత్త్వము. అన్యజాతిచే నాక్రమింపబడిన పక్షమున అంతవఱకును హైం దవజాతియొక్క స్వత్వమునకు న్యూనతగల్గు చున్నది. హైందన జాతి అంతవఱకును సంపూర్ణ స్ఫురణమున వెలుగ వెలిచీర కుమసిదాకినట్లు కళంకితమై యుండును. దేహములో నేభాగము రోగపీడితమైనను, ఆరోగ్యమునకు వెల్తియేగదా! మఱియు, భిన్న జాతు లన్యోన్యమాక్రమించి తమ యాదర్శములను పర స్పరము జంపుకొనుటచే భగవత్సంకల్పము వృధయగును. ప్రతి జాతికిని తదితరములకంటే భిన్నమైన స్వస్థితిని, స్వరూపమును, స్వవ్యాపారముల నేర్పఱచిన భగవంతున కుద్దేశము లేక పోయెనా? యేజాతి తన తన స్థానమందు నిలిచి, తనకు విధించిన స్వరూపమున సంపూర్ణముగా విలపించి, నిజవ్యాపారములు యందు చరించుచు తనకంటే భిన్నములైన జాతులకు తమతమ వ్యాపారముల జేయఁ దోడ్పడుచు, సృష్టిపై చిత్రమును వెల్ల డించుటయే దైవసంకల్పము. ఈవిషయము రాత్రియం దాక సమువంక జూచినచో తేటపడగలదు. లెక్కకు మిక్కిలియైన ఖగోళములు నానావిధ పరిమాణములుగల పై నిజవ్యాపార పరాయణములై అన్యోన్య మెంతమైత్రితో ప్రవర్తించుచున్నవి!. ఈగోళములలో నెయ్యది గాని ఆవంత తన తేజమును గోలు పోయినచో నేమిరాగలదు? తేజము గ్రుంగుటచే నాకర్షణ శక్తి యును గ్రుంగును. అన్యోన్యాకర్షణశక్తిచే నిప్పుడు తులతూగి నట్లుండు నీ ఖగోళములన్నియు స్థానభ్రష్టములు కాఁగలవు. తన్మూలమున నీగోళములు తమ ఆవర్తపరివర్తనములచే నెం శొంటితో ఢీకొని పిండిపిండి కాగలవు. కావుననే ఆయాగోళము తనతన వ్యాపారములను నిండు తేజముతో జరుపు చున్నది.

ఆంధ్ర మహోద్యమ తత్వము. 3 ప్రపంచమునందు సైతము ఒక్క గడ్డి పఱక, ఒక్క అణువైనను సరే తన వ్యాపారమును మానినను, లేక మార్చినను, చరాచరా త్మక మైన ఈ సర్వవిశ్వమునకును బాధగలుగఁగలదు. వ్యాపారము మార్చుటయేగాదు. తన తేజము నెంతమాత్రము విసర్జించినను లేక తనకు విధించిన సంపూర్ణ స్పురణకంటే మిక్కిలిగా ప్రకా శించినను, బ్రహ్మాండముల కన్యోన్య సంఘర్షణము గల్గును. బ్రహ్మాండములపాలించు ధర్మమే జాతులసయితము పాలించు చున్నది. విశ్వమున కంతయు ధర్మమొక్కటియే. జాతులు విశ్వ మునకు వెలియైనవిగావు. కావున జాతులును ఆధర్మము చేత నే పాలింపబడవలెను. జాతి ఆధర్మమును పాటింపక విశ్వమును పీడించిన నాడు . విశ్వముయొక్క ప్రతిపీడనము స్వధర్మాపరా ధనియైన అజాతీపై రాగలదు. అందుచే జాతిలయించి దాని స్థానమున స్వధర్మపరాయణయైన మఱియొక జాతి ప్రవేశించును. అట్లు లేక విశ్వప్రతిపీడనమునకుఁ గూడ ఆజాతి మిక్కిలియైన చో పరస్పర పీడనములచే విశ్వమే నశించును. కావుననే జాతికి స్వయమగు రూపమునకు నాశము గలుగఁ జేయుటగాని, స్వవ్యాపారముల మార్చుటగాని, నిండు తేజముతో విలసింపక -పోవుటగాని జాతికే అపాయకరము, లేదా ప్రపంచమున కపాయకరము, అట్లే జాతిసంకరముకూడ కూడని పని. • హిందూదేశము ఏకభాషను గ్రహించి యేక జాతి యగు నను మాట కల్ల. మన దేశమందు సమష్టి జాతిత్వము సాధ్య మగునేగాని, ఏక జాతిత్వము సాధ్యముగాదు. వాంఛ నీయమునుగాదు. ప్రకృతిచేతనే భిన్న ధర్మములతో నేర్పడిన