పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యన్యోన్రాక్రమణముల చేఁ గల్గు చేటులు గుర్తెఱుంగ నగును. ఈపుస్తమునం దక్కడక్కడ పునరుక్తి గాననయ్యెను. ఒ కేవిషయమును అనేక శాస్త్రరీతులచే పరిశీలుంచుట చేఁ గలి గిన యవస్థ యేగాని ఇయ్యదొక దోషము గాదు. ఇంతియ కాక యవస్థయేగాని సద్భావముల నిట్టి పునరుక్తి సమ్మోముప్రభవము గావున దాని న ట్లే ఉంచితిని. దీనింజదువుటవలన ఆంధ్రులలో నొక్కని కేని శాస్త్ర చదువు గలిగెనేని నేను కృతారుఁడను. శాస్త్రవిషయమునందు నాకు ప్రవేశము గలిగించిన శ్రీయుత వీరభద్రశర్మగారికిని, ఈగ్రంథము వ్రాయుటలో సహా యమొనరించిన మామిత్రుఁడు శ్రీమా॥ సి. ఆర్. కృష్ణమా చార్యులు గారికిని నేనెంతయు కృతజ్ఞుఁడను. నెల్లూ 85. 1-5-20 ఇట్లు విన్నవించు భవత్సోదరుడు. కొం శ్రీరాములు.


శ్రీ ఆంధ్ర మహెూద్యను తత్త్వము. ఆంధ్ర సీమయం దెచ్చో జూచినను నూతనా వేశ మొకటి గన్పట్టుచున్నది. ఈ యుత్సాహము సద్యోజాతమై ఇదివఱకు నిద్రించుచుండిన ఆంధ్రజనులు నాక్రమించి వారి యందు భ్రాతృభానము పెంచుచున్నది. హిందూ దేశ మంతయు కలఁదెలిసి హిందువుల స్వత్వమును స్మరణకు దెచ్చు ప్రయత్న ముననుండ ఆంధ్రులు తమ జాతిస్వత్వమును తమవారి హృద యములయం దంకురింపజేయ పాటుపడుచున్నారు. ఆంధ్రుల ప్రయత్నము హైందవోద్యోగమునకు ప్రతిధ్వని. హైందవా దర్శముల నెట్లు కొందరు హైందవ ప్రముఖులు బడయగోరు చున్నారో అట్లే ఆంధ్రులుపై తము తమజాతీయాదర్శములఁ జేర జూచుచున్నారు. స్వస్వజాత్యాదర్శములు నాయజాతియందు నెలకొల్పినగాని, భిన్న జాతులకుటుంబమైన ఈహిందూ దేశమున హైందవాదర్శములఁ బొందఁగోరుట తల పెట్టరాని పని. దేహ మందు ప్రత్యంగ సౌష్ఠవమే సంపూర్ణ దేహ సౌష్ఠవమున కెట్లు కారణమో, అట్లే హైందవ జాతియందును ప్రతిజాతిసౌష్ఠవము జాతీయారోగ్యమునకు మూలము. హిందూదేశమున గల జాతులలో నెయ్యదిగాని తనజాతిస్వత్వమును గోలుపోయి అన్యజాతి సంపర్కమున తనయాదర్శములను సందేశమును మరచి