పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టీ.

చౌవంచ...సాహేబు = (4 + 1) ఐదుముఖములు గలదొర; జాళువా...విలుకాఁడు = బంగారుకొండ (మేరుపర్వతము) విల్లుగాఁ గలవాఁడు; గిబ్బరౌతు = ఎద్దునెక్కువాఁడు; జక్కులనేస్తి= యక్షపతి యగుకుబేరునికి చెలికాఁడు; జన్నంపుఁబగవాఁడు = దక్షయజ్ఞవిరోధి; పొడల...దాల్పు = జంటపోగులుగల మచ్చలవస్త్రమును (పులితోలును) ధరించినవాఁడు; పునుకదారి = కపాలమును ధరించువాఁడు; వినువాఁకమోపరి = ఆకాశగంగను దలధరించినవాఁడు; వెండికొండదునీఁడు = కైలాసపర్వత మునికిగాఁ గలమేటి; మినుజుట్టుదేవర = ఆకాశమే సిగగాఁగల దేవుఁడు; మిత్తిమిత్తి = మృత్యువును చంపినవాఁడు; మంచుమలల్లుఁడు = హిమవత్పర్వతమున కల్లుఁడు; మరుగొంగ = మన్మథుని విరోధి; ముక్కంటి = మూడుకన్నులవాఁడు; నెలదారి = చంద్రుని ధరించినవాఁడు; ముమ్మొన...మేటి = మూఁడుమొనల (త్రిశూల మను) ఆయుధము గలదొర; విసపుమేఁతరి = హాలాహలమును భక్షించినవాఁడు; తిగ...కాఁడు = త్రిపురముల వేటాడినవాఁదు; కప్పు...పెనిమిటి = నల్లనిచాయగల స్త్రీకి (పార్వతికి) భర్త; గాములదొర = భూతపతి; వేల్పుదణిఁ గన్నతఁడు = దేవసేనానియగు కుమారస్వామికి తండ్రి; గుజ్జు...తండ్రి = పొట్టిదేవుఁ డగువినాయకునితండ్రి; బేసికన్సామి = మూఁడుకన్నుల దేవుఁడు — 23 = శివుఁడు.


సీ.

వెన్నుఁడు పెరుమాళ్లు వేకంటిసైదోడు
                    కవ్వపుమలదాల్పు కఱ్ఱినేస్తి
చిలువపానుపుదంట తెలిదీవిమన్నీఁడు
                    బటువుఁగైదువుజోదు బమ్మతండ్రి
కఱివేల్పు మరునయ్య కడలియల్లుఁడు సంకు
                    దారి గరుడిరౌతు తమ్మికంటి