పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పదివేసములదిట్ట యెదమచ్చ గలసామి
                    యడుగువాఁకగలాఁడు పుడమినంటు


తే.

మొసలివాయొంట్లతాల్పు రక్కసులగొంగ
లచ్చిమగఁ డుడ్డకేలుగలాఁడు పుట్టు
వడుగు తామరపొక్కిలివాఁడు పసిఁడి
వలువతా ల్పన హరిపేరు లలరు సాంబ.

4


టీ.

వెన్నుఁడు; పెరుమాళ్లు (ఇది ద్రవిడపదము); వేకంటిసైదోడు = (వామనావతారమున) వేయికన్నులు గలయింద్రునికిఁ దోఁబుట్టువైనవాఁడు - ఉపేంద్రుఁడు; కవ్వపు...తాల్పు= మందరపర్వతమును (కూర్మావతారమున) ధరించినవాఁడు; కఱ్ఱినేస్తి = అర్జునుని చెలికాఁడు; చిలువ...దంట = సర్పము (అనఁగా ఆదిశేషుఁడు) శయ్యగాఁ గల నేర్పరి; తెలి...మన్నీఁడు = శ్వేతద్వీపము వాసస్థానముగాఁ గల ప్రభువు; బటువు...జోదు = చక్రాయుధమును దాల్చినయోధుఁడు; బమ్మతండ్రి = బ్రహ్మకు దఁడ్రి; కఱివేల్పు = నల్లనిదేవుఁడు; మరునయ్య = మన్మథునితండ్రి); కడలియల్లుఁడు = పాలసముద్రునికి నల్లుఁడైనవాఁడు; సంకుదారి = శంఖమును ధరించినవాఁడు; గరుడిరౌతు = గరుత్మంతు నెక్కి తిరుగువాఁడు; తమ్మికంటి = తామరలవంటి కన్నులు గలవాఁడు; పది...దిట్ట = దశావతారములనెత్తిన నేర్పరి; ఎద...సామి = ఱొమ్మునందు శ్రీవత్స మను పుట్టుమచ్చ గలదేవుఁడు; అడుగు...గలాఁడు = పాదములందు గంగానది గలవాఁడు - గంగ యతనిపాదములందుఁ బుట్టిన దని యర్థము); పుడమినంటు = భూదేవికి స్నేహితుఁడు (అనఁగా ప్రియుఁడు); మొసలి...తాల్పు = మొసలినోటివలె నుండుపోఁగులను (అనగా మకరకుండలములను ధరించినవాఁడు; రక్కసులగొంగ = రాక్షసులకు శత్రువు; లచ్చిమగఁడు = లక్ష్మీదేవి భర్త; ఉడ్డ...