పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెట్టించుకొను మేటి = భక్తులచే గుంజిళ్ళు పెట్టించుకొను దొర; పిళ్ళారి; కుడుముదాలుపు = కుడుములను చేత ధరించియున్నవాఁడు; పెద్ద... వేలుపు = గొప్పబొజ్జగల దేవుఁడు; ఒంటిపల్లుదొర = ఒకదంతముగల యేలిక; ముక్కంటి... దేవర = టెంకాయలను భక్షించు దేవుఁడు; చిలువ.. మేటి = సర్పములు జందెములుగాఁ గలదొర; జమిలి... బిడ్డ = ఇద్దరుతల్లుల (అనఁగా గంగాపార్వతుల) బిడ్డ; పెద్దమెయిప్రోడ = గొప్పదేహము గల దిట్ట; చేటవీనులదణి = (గజముఖుఁడు గనుక) చేటలవంటి చెవులు గలదొర ; పని...వాఁడు = విఘ్నములకు రాజు; మొదటివేలుపు = మొదటఁ బూజిఁపఁబడు దేవుఁడు; వెనకయ్య; పుంజుదారి పెద్ద = కుక్కుటధ్వజుఁడగు కుమారస్వామికి అన్నయైన వాఁడు — 20 = వినాయకుఁడు.


సీ.

చౌవంచమోములసాహేబు జాళువా
                    గుబ్బలివిలుకాఁడు గిబ్బరౌతు
జక్కులదొరనేస్తి, జన్నంపుఁబగవాఁడు
                    పొడలగింటముదాల్పు పునుకదారి
వినువాఁకమోపరి వెండికొండదునీఁడు
                    మినుజుట్టుదేవర మిత్తిమిత్తి
మంచుమలల్లుఁడు మరుగొంగ ముక్కంటి
                    నెలదారి ముమ్మొనయలుఁగుమేటి


తే.

విసపుమేఁతరి తిగప్రోలివేఁటకాఁడు
కప్పుటైదువపెనిమిటి గాములదొర
వేల్పుదణిగన్నతఁడు గుజ్జువేల్పుతండ్రి
బేసికన్సామి యన నీదుపేళ్లు సాంబ.

3