పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వర్గు మానవవర్గు స్థావరవర్లు తిర్యగ్వర్గు అను నాలుగువర్గులుగా విభజించి, జల్లి(కల్ల)పదములుగాని, వ్యర్థపదములుగాని పెట్టక, వర్ణలోపపదములను జొరనీక సరళశైలిని “ఆంధ్రనామనిఘంటువు" అను నీగ్రంథమును తెనుఁగు జదువువారల కుపయుక్తముగ కవులకృపచే నీయనుగ్రహముచేతను సీసశతకముగా చెప్పుచున్నాను చిత్తగింపుము!


సీ.

ముక్కంటితొలిపట్టి మొట్టికాయలమెప్పు
                    గొప్పబొజ్జగలాఁడు గుజ్జువేల్పు
గబ్బుచెక్కిళ్లమెకముమోముగలసామి
                    కలుగులాయపుఁదేజిబలుసిపాయి
గుంజిళ్లు బెట్టించుకొనుమేటి పిళ్లారి
                    కుడుముదాలుపు పెద్దకడుపువేలు
పొంటిపల్లుదొర ముక్కంటిపండులమెక్కు
                    దేవర చిలువజందెములమేటి


తే.

జమిలితల్లులబిడ్డ పెద్దమెయిప్రోడ
చేటవీనులదణి పనిచెఱుపువాఁడు
మొదటివేలుపు వెనకయ్య పుంజుదారి
పెద్ద యనఁ దగు గణపతి పేళ్లు సాంబ.

2


టీ.

ముక్కంటితొలిపట్టి = శివుని మొదటిబిడ్డ; మొట్టికాయలమెప్పు = భక్తులు వేసికొను మొట్టికాయలకు మెచ్చుకొనువాఁడు; గొప్ప.. గలాఁడు = పెద్దపొట్టగలవాఁడు; గుజ్జువేల్పు = పొట్టిదేవుఁడు; గబ్బు...సామి = ఏనుఁగుమొగముగల దేవుఁడు; కలుఁగు... సిపాయి = కలుగులు గుఱ్ఱపుశాలగాఁ గలగుఱ్ఱములు (అనఁగా ఎలుకలు) వాహనముగాఁ గల గొప్పవీరుఁడు; గుంజిళ్ళు