పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఆంధ్రనామనిఘంటువు

(సాంబనిఘంటువు)

సటీకము

అవతారిక.

కస్తూరిరంగకవి యనునతఁ డీనిఘంటువును శ్రీసాంబమూర్తి కంకితము సేయువాఁడై మొదట దీనిని రచించు పద్ధతిని దెలుపుచున్నాఁడు:—


సీ.

శ్రీ వెలయంగ దేశీయముల్ దెనుఁగులుఁ
                    దద్భవంబులుఁ గూర్చి దైవవర్గు
దనరు మానవవర్గు స్థావరవర్గు తి
                    ర్యగ్వర్గు ననునాలు గలవరించి
జల్లు లుంపక వ్యర్ధశబ్దముల్ రానీక
                    కుంటినడత గాక కొదుకు లేక
యుర్వీజనంబుల కుపకారసరణిగా
                    నాంధ్రనామనిఘంటు వనెడుకృతిని


తే.

గవులదయచేత నీకటాక్షంబువలన
సీసశతకంబుఁ జెప్పెదఁ జిత్తగింపు
దనుజసమవర్తి భక్తహృదబ్జవర్తి
సకలసురచక్రవర్తి శ్రీసాంబమూర్తి.

1


టీ.

ఓ సాంబమూర్తీ! ఈయాంధ్రభాష యందుఁగల యన్యదేశీయములును ద్రిలింగదేశీయములును సంస్కృతప్రాకృతభవములును గూర్చి, వానిని దేవ