పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకగణితము


పెద్ద మొత్తములు గల సంఖ్యలకు వేర్వేఱు గుర్తు లేర్పఱిచిరి: C=039; M=0229 (1-వ పుటలోని పట్టిక ఁ జూడుఁడు). రోమనుల సంఖ్య లీప్పటికిని మనము గడియారములపైఁ జూచు చున్నాము. పాశ్చాత్యదేశములలోని యూరోపియను లందఱు రోమను సంఖ్యలను దఱచుగ వాడెదరు. కొన్ని తరుణముల మార్పుకొఱకై సంఖ్యలను వాడెదరు. ప్రశ్నపత్రములలో సాధారణముగ గాంభీర్య మునకై రోమను సంఖ్యల నే విశేషముగ నుపయోగించెదరు. హిందువుల సంఖ్యా క్రమ నిరూపణము

ఇంతవరుకు వర్ణింపఁబడిన సంఖ్యా క్రమవిధానము లన్నియు నం కెలను వ్రాయుటకుఁ దప్ప గణితశాస్త్ర వ్యవహారములను సులభ ముగా నెఱవేర్చుటకు సాహాయ్యకారులు కావు. పై అంకావళులన్నియు సంఖ్యలను గుర్తులచే వ్రాయుటకే కాని లెక్కలు చేయుట కనుకూల ములు కావు. హిందువుల సంఖ్యా క్రమవిధానము పైవానికంటె నెట్లు భిన్న మో, అది ప్రస్తుతము నాగరక ప్రపంచమునంత ను శాఖోపశాఖ లుగ నల్లుకొనియున్న గణితశాస్త్రవృక్షమున కెట్లు బీజాంకుర మయ్యెనో యించుక విచారింత ము.
ఇతర దేశస్థులవలెనే హిందువులు గూడ మొట్టమొదట సంఖ్య లకుఁ గల మాటలయొక్క మొదటి యక్షరముల నుపయోగించిరనియు, కాలక్రమమున నాయక్షరములయొక్క రూపములు మాఱి ప్రస్తుతము వాడుకలోనున్న యం కె లేర్పడినవనియు పాశ్చాత్యులలో కొందఱు చరిత్రకారులయొక్క యభిప్రాయము. కాని మిక్కిలి పురాతనములగు హిందువుల శాసనములలో నున్న యంకెలను బరీక్షించిన యెడల, ఆ "సంఖ్యలకును, వానికి సరియైన మాటలలో నున్న మొదటి యక్షరముల కును ఏ విధమైన పోలికయు లేకపోవుటనుబట్టి మన సంఖ్యారూపము లొకప్పు డక్షరములై యుండెననుట శంకాస్పదము.
పూర్వకాలపు శాసనములను, నాణెములను బరీక్షించుటవలన ప్రాచీన సంఖ్యా క్రమ నిరూపణ మెట్టులుండెనో అప్పటి సంఖ్యలకును ఇప్పటిసంఖ్యలకును రూప భేదము లేవైనఁ గలవో యను నిట్టి ముఖ్యాంశ ముల నిర్ణయించుట కాధారములు గలవు. చరిత్రకారులకుఁ దెలిసినంత వఱకు అంకెలున్న శాసనములలో మిక్కిలి పురాతనమైనవి అశోకుని శిలాశాసనములు. ఇవి క్రీస్తునకుఁ బూర్వము మూఁడవశతాబ్దిలోఁ బుట్టి నవి. ఇందు కపుర్ధగిరిశాసనములో “ నాల్గు” నాలుగు గీట్ల చేఁ దెలుపఁ ది (IIII = 8). క్రీస్తునకుఁ బూర్వము రమారమి నూఱు బడియున్నది సంవత్సరముల క్రిందటఁ బుట్టిన “తక్షశిలాశాసనము”లో (87) డెబ్బది యెనిమి దనుసంఖ్య యీవిధముగఁ దెల్పఁబడియున్నది: ౩X౨ ౧ +౧x౧ ౧ +౨ x ౪ =౭౮ ఇందు ౨,౧ ; ౧ ౧ ;౪ వీనికి వేర్వేలు గుర్తులు గలవు. ఈశాసనమునందే నాల్గునకు నాలుగు నిలువు గీటులకు బదులు ఒక యడ్డగీటును, ఒక నిలువుగీటును (+) జూడనగును,
క్రీస్తునకుఁబూర్వము దక్షిణహిందూస్థానములో వ్రాయఁబడిన యాంధ్ర రాజుల శాసనములలో సాధారణముగ సంకెలు వ్రాయుట

వాడుక లేనట్లు తోఁచుచున్నది. " కాల్సీ ”శాసనములోమాత్రము నాల్గను సంఖ్య యేటవాలుగ రెండుగీఁతలచేఁ దెల్పఁబడియున్నది (X). రూప నాధశాసనమున 'వేయి' యను సంఖ్యకు బదులుగ సహస్ర ములతో వ్రాసియున్నది. హిందువుల సంఖ్యా క్రమమును సాంతముగఁ దెలుపుశాసనములు బొంబైరాజధానిలోని “నానామట్టు" గుహలలో నున్నవి. ఈశాసనము లాగుహలయొక్క తాతిగోడలపైఁ జెక్కఁబడియున్నవి. ఇవి యాంధ్ర రాజుల వృత్తాంతములను దెలిపెడి శాసనములని ప్రతీతి. ఈ శాసనము నున్నట్టియు, క్రీస్తుశకము రెండవ శతాబ్ది నాఁటి వగు నాసిక గుహాశాసనములలో నున్నట్టియు అంకెలరూపము లీ క్రింది పటమునఁ జూపఁబడినవి.


ఇందలి ౧వ పంక్తిలోని యంకెలు ' నా నాఘట్టు' శాసనముల లోనివి; ౨-స పంక్తిలోనివి శ్రీ. శ. ౧వ శతాబ్దియందు కొండగుహ లలోఁ జెక్కిన శాసనములలోనివి; 3-వ పంక్తిలోనివి పదు శతాబ్ది యందలి దేవనాగరియం కెలు; క-వ పంక్తిలోనిని పండ్రెండవ శతా ల్దియందలి తూర్పు అరబ్బులయం కెలు; అయిదవ పంక్తిలోనిని ఎనిమి దవ, తొమ్మిదవ శతాబ్దులలోని ఘోబిర్ అంకెలు,
పైపటములో నున్న రెండవ పంక్తిలోని యంకెలను జూడ నగును. ఇందు ఒకటి మొదలు తొమ్మిదివఱకును గల సంఖ్యలు క్రీస్తు శకము రెండవ శతాబ్దిలో వ్రాసినరూపములతోఁ జూపఁబడినవి. ఈకాలమునాఁటి కింకను సంఖ్యలలో స్థాన భేదములును, “సున్న” యును గనుపట్టియుండ లేదు.
క్రీస్తుశకము ఒకటి రెండు శతాబ్దులలోఁ బుట్టిన “మధురా పుర శాసనము”లోఁగూడ 'నా నా భుట్టు సంఖ్యలనలేనే … = = గుర్తు లొకటి రెండు మూఁడు సంఖ్యలకు వరుసగ నున్నవి. తరువాత నాలుగు మొదలు తొమ్మిదివటి కే కాక ౨౧, 32 మొదలు నూటివఱకును గల పదులకును, నూటికిని, వేయికిని వేర్వేలు గుర్తులున్నవి. ఇంతకంటే నెక్కుడుసంఖ్యలు వేర్వేఱం గుర్తుల చేఁ దెలిపెడివారు. నందుఁ గూడ “సున్న” కు నేమియం గుర్తులేదు. ఈశాసనము