పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర విజ్ఞాన-సర్వస్వము


ఈ యక్షరము అవ్యక్త నాదమునకు మొదటి వ్యక్తనాదస్వరూపము. అకారము తెలిసి సంతవఱకు అన్ని భాషలకును అక్ష రామ్నా యమునందు మొదటి యకరముగ నున్నది. ఆంధ్ర, సంస్కృతాక్షరములకు బ్రాహ్మీలిపి మూల ప్రకృతి. హైందవలిపికి ఫోనీషియనులిపి మూల మూలప్రకృతి యను సిద్ధాంత మీపు సంతరించినది. ఫొనీషియను అక్షరామ్నాయమునం దీయకరము ప్రకృతిసిద్ధమైన ధ్వనిగ వెలయుచుండెను. కాలక్రమమున ' అలెన్ ' నామరూపము లేర్పడినవి. ఈయగరము ఫొనీషియను భాషయందు అలెఫ్, గ్రీకునందు అల్ఫా, పౌరసీలో ఆలీఫ్, ఆంగ్లము నందు ఏ, సంస్కృతాంధ్రములందు అ యని వ్యవహరింపఁబడు ఆం ధ్రాక్షరములం దీయ క్షరరూపము అశోకుని శాసనముల లోని గృగ రూపములనుండి క్రమముగ నేర్పడినది. నాఁటినుండి నేఁటిపఱకుఁ గల శాసనావళిని బరీక్షింప క్రీ. శ. పూర్వపు భట్టిప్రోలు స్తూపశాసనములందు ఆ రూపముగను, క్రీ. శ. మూఁడవ శతాబ్ది నాఁటి ఇక్ష్వాకు ఐంశపు రాజుల జగ్గయ్య పేట, నాగార్జునకొండ స్తూప శాసనములందు " రూపముగను, క్రీ. శ. అయిదవ శతాబ్దినాఁటి శాలం కాయన వంశీజుల శాసనములందును, మొదటి కళింగ గాంగవంశజుల శాసనములందును ఊరూపముగను, క్రీ. శ. ఆఱవ, ఏడవశతాబ్దులలో విష్ణుకుండి, వేంగీచాళుక్యుల శాసనములందు శ్రీ, ఆ రూపములుగను, శ్రీ. శ. తొమ్మిదన, పదవ శతాబ్దులనాఁటి శాసనముల స్త్రీ రూపముగను క్రీ.శ. పదునొకండవ శతాబ్దిని రాజరాజనరేంద్ర, నన్నయభట్టులు కాలమున ఆరూపముగను, క్రీ. శ. పదునాలుగవ శతాబ్దిశాసనముల ల ఈరూపముగను కాలక్రమమున మార్పులు చెంది తుదకు అగా పరిణమించినది. మొదటినుండియు ఆంధ్ర కర్ణాటులకు లిపి యొక్కటియే యగుటచే ఈ కడపటీరూపమే హళకన్నడమునను గన్పట్టుచున్నది. ఈ రూపమే యిప్పటికిని వాడుకయం దున్నది. హిందూదేశమున మార్య అశోక చక్రవర్తి కాలమునుండి వాడు కలోనుండిన బ్రాహ్మీ, ఖరోష్ఠీ, లిపులలో తొలుదొలుత 'అ' స్వరూప

మెట్లుండినదియు, బ్రాహ్మీలిపిలోని 'అ' కాలక్రమమున తెలుఁగు, కన్నడ, నాగర, గ్రంథ, తమిళలిపులలో ఇట్లు పరిణామమును జెంది నదియం ఈ దిగువఁ జూపఁబడినది. బ్రాహ్మీలిపి ఆ రూపము ; ఖరోష్టి లిపి ఆ రూపము

అ-అనునకరమునకు ఉత్పత్తిస్థానము కంకము. సంస్కృత వ్యాకరణము ప్రకారము అకారమునకుఁ బదునెనిమిది ధ్వనులు కలవు. ఇది హ్రస్వ దీర్ఘ ప్లుత భేదములచే మూఁడు తెఱఁగులు. ఇది మరల ఉదాత్తానుదాత్త స్వరితము లను భేదములచే తొమ్మిది విధంబు ఇదియు మరల అనునాసికానను నాసిక భేదంబులఁ బదు నెనిమిది యుచ్చారణ లయ్యె. ఇట్లొక అకారమును సంస్కృతమున పదునెనిమిది విధములఁ బలుకుదురు. ఆంధ్ర భాష యందు హ్రస్వ, ములు మాత్రము గలవు. వ్యవహారమున ఫ్లుత మున్నది; కాని గ్రాంథిక భాష యందు దీనికి ప్రచారము తక్కువ. అకారమునకు తెలుఁగునందు కంకతాలస్య మైన యుచ్చారణ గలదు. ఆ యుచ్చారణ తాటాకు మొదలగుశబ్దములందుఁ గనుపడుచున్నది. ఇది తెలుఁగునందు ఇకా రాకార సంయోగమువలనఁ గలుగుచున్నది.