పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములను పరిశీలించినపుడు తద్విషయవిజ్ఞాన మసమ గ్ర ముగ నున్న విధము విశద మగుచున్నది. ఆంధ్రత్వమునకు సంబంధించిన విజ్ఞాన మత్యంతమును అసమగ్ర మని విస్పష్ట మగుచున్నది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమునకు ప్ర యోజన మాంధ్రుల కనుభవసిద్ధమైన సంస్కారస్వరూపమున విశ్వవిజ్ఞానాను భవమును సులభముచేయుట యై యున్నది. దేశకాల పాత్ర మత భాషాద్యావరణములందు సంవర్ధితంబులైన వివిధ విజ్ఞానములను విజ్ఞానామృతమథనమునకు సమర్పణము చేయుట విజ్ఞాన సర్వస్వములకు పరమార్థము. ప్రవృత్తి యందు గుణదోష నిర్ణయములు దేశ కాల పాత్రావర ణములందు సంకుచిత విశాల భావరూపములను దాల్చు చుండును. సంకుచితమైన భావరూపములు విజ్ఞాన సాధ నమున విశాలములయి ధర్మాభ్యదయము గలుగుచున్నది. ఆం ధ్ర విజ్ఞాన సర్వస్వ విూపరమార్థమును విజ్ఞాన సంపన్నుల సాహాయ్యమున సమకూర్పగలదు! ఆంధ్రమునందు వివిధ శాస్త్రములు, కళలు, పరిశ్రమలు మొదలగు విషయములకు సంబంధించిన పారిభాషిక పదములును, విజ్ఞాన గ్రంథములును నిర్మింప బడిన తరువాత విజ్ఞానసర్వస్వ ప్రచురణము సులభసాధ్య ముగ నుండియుండును. విజ్ఞాన వికాసమునకు ఆద్యంత ములు లేవు. నూతన శాస్త్రములు పుట్టి విజ్ఞానము నిరంతరము వికాసమునొందుచుండుట అభ్యుదయము నకు లక్షణము. ' ఎక్ సైక్లోపీడియా బ్రిటానికా 'యొక్క పదునాలుగవ ఆవృత్తియందు పదమూడవ ఆవృత్తి యందు లేని నూతనవిషయము లెన్నియో కలవు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును ఇతర భాషలయందలి విజ్ఞాన సర్వస్వ ముల సాహాయ్యమునను, ప్రస్తుతము లభ్యమైన ఆంధ్ర విజ్ఞానాధారమునను ప్రచురించుట శాస్త్రకళావిజ్ఞానా భ్యుదయమున కనుకూలము గాని ప్రతికూలము గాదు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ ప్రచురణమును, శాస్త్రకళా గ్రంథ ముల ప్రచురణమును విజ్ఞానాభ్యుదయమున కన్యోన్యా శ్రయములు. వర్తమాన కాలమునందు వివిధ శాస్త్రము లందును ప్రత్యేకముగ విశ్వకోశములు ప్రచురింపబడు చున్నవి. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగా రీసాధక బాధ కములను గ్రహించియె ఆంధ్ర విజ్ఞానసర్వస్వము నారంభిం చిరి. వారి సంకల్పము నే సఫలము చేయుటకై చేయుచున్న ప్రయత్నములు లోప భూయిష్ఠములుగ నుండుట సహ జము. విజ్ఞాన ప్రియులు దుర్ఘట ప్రయత్న మునందలి గుణ ములను గ్రహించి దోషములను మన్నింప బ్రార్థితులు. విశాలమైన ఆంధ్రావనియందును పూర్వమువ లె ముందును మహానుభావు లుద్భవింపగలరు. వారి మహా ప్రయత్నము ప్రయత్నము కొంతవఱకైనను ఉప యోగపడినచో నిర్వాహకులు కృతార్థులు. విశ్వవిజ్ఞాన మూర్తియును, ఆంధ్ర విజ్ఞాన ప్రపంచమును, ఈసంకల్ప స్వభావమును కార్యభారమును గ్రహించి " విజ్ఞానమయ మైన ఆత్మోపలబ్ధి "కై సకలవిధముల నీసదుద్యమము సఫల మగుట కనుగ్రహించుగాత !

ఆంగీరస సం|| ఆశ్వయుజ బహుళ <

పంచమీ బుధవారము,

చెన్నపురి


కా. నాగేశ్వరరావు,