పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లందును, విజ్ఞాన లక్ష్యలక్షణములందును, విజ్ఞాన సాధనమః లందును, విజ్ఞానోపార్జనరక్షణములందును వి శేషవి కాసము గలిగినది. ప్రపంచావృతమైన విజ్ఞానవికాస మాంధ్రలోక మునందును సర్వత్ర గోచరం బగుచున్నది. ఇరువ దేండ్లకు పూర్వ మారంభ మైన ఆం ధ్రవిజ్ఞాన సర్వస్వనిర్వహణమునం దంత రాయములు సంప్రాప్తము లయి పని నిలిచిపోయినది.— ఈనడుమను మహారాష్ట్ర హిందీ భాషలందు విశ్వకోశములు= వెలువడినవి. విజ్ఞాన సర్వస్వములకు మాతృకమైన ' ఎసై క్లోపీడియా బ్రిటానికా ' (Encyclopaedia Britannica ) యొక్క పదునాల్గవ ముద్రణము ౧౯౨౯-వ సంవత్సరము నందు వెలువడినది. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము ఇతర విజ్ఞాన సర్వస్వముల వలె బహుజన సాహాయ్యమునను, విశేష సాధనసంపత్తి పరిశ్రమమూలమునను, బహుళసంపుటముల రూపమునను సఫలము గావలసియున్నది. ఈ మహా కార్యనిర్వహణము దుష్కర మైనను పూర్వ పర సంపుటములకు భావ రూప లక్ష్యములందు సామ్యానుసంధానము అత్యంతావ శ్యకములు. ఈ పరిస్థితులందు ఆంధ్ర సంపుటమును ప్ర చు రించుటకును, లక్ష్మణరావుగారి సంకల్పమును సఫలము చేయుటకును మొదటి సంపుటముల పునర్ముద్రణావసర మును ప్రాజ్ఞులు గ్రహింపనోపుదురు. పునర్ముద్రిత మైన మొదటి సంపుటము ' డెమ్మి ' నాలుగు పుటలు యాకృతిని 'ఇంగ్లీషు బాడీ' యక్షరములందు ముద్రింపబడినది. క్రొత్త సంపుటమునందు నూతనాంశముల ననేకములను చేర్చినను గ్రంథ ప్రమాణము తగ్గి ము ద్రణవ్యయాదికములందు సౌక ర్యములు సాధ్యములైనవి. ప్రథమ ద్వితీయ ముద్రణముల పరిశీలన విూవిషయమును విశదము చేయగలదు. పున-ర్ముద్రణమునకు గారణము లక్ష్మణ రావుగారిపట్ల గల గౌరవకృతజ్ఞత లనియును, స్వాభిమానకృతఘ్నతలు గావనియును ప్రాజ్ఞులు గ్రహింపనోపుదురు. ఆంధ్రులును ఇతరజాతులవ లెనే కాలమహా ప్రవా హమునందు మునుగుచు తేలుచు చిర కాలానుగతంబై న సంస్కార బలమున వర్ధిల్లుచున్నారు. విశ్వావృతమైన మహా ప్రబోధయుగమునం బాంధ్ర ప్రబోధముగూడ హిందూ స్థానాభ్యుదయమునకును, ప్రపంచాభ్యుదయమునకును అత్యంతావశ్యకము. ఆంధ్ర హృదయమునందు నిగూఢ ముగ నున్న జ్ఞానసంస్కారము నాంధ్రోద్యమము ప్రత్య క్షము చేయుచున్నది. సర్వతోముఖ మైన విజ్ఞానోపా ర్జనము 9, 90, 00, 000 ఆంధ్రుల ఆత్మోపలబ్ధికి సాధన భూతముగ నున్నది. చిరకాలసంవర్ధిత మైన విజ్ఞానము దేశకాలపాత్ర సంవర్ధిత మైనను దేశకాల పాత్రా తీతమై విశ్వకల్యాణమునకు వినియోగపడుచున్నది. చిర కాలోపార్జిత మైన విజ్ఞానసంచయ మేక ముఖమున సామాన్యులకును కరతలామలక మగుటకు విజ్ఞానకోశ ములు సాధన భూతములుగ నున్నవి. విశ్వవిజ్ఞానకోశముల లక్ష్యము నిర్వాహకుల లక్ష్య సంకల్ప సంస్కారముల కనురూపముగ నుండును. ఎ౯ సైక్లోపీడియా బ్రిటానికా 'యొక్క లక్ష్య మాంగ్ల సంస్కారమును పాశ్చాత్యసంస్కారమును సమర్థించుట కును, విశదము చేయుటకును వినియోగపడినవిధమున ప్రాచ్యసంస్కారమును, హిందూసంస్కారమును విశ దము చేయుటకు వినియోగపడజాలదు. ' ఎ్ సైక్లోపీడియా బ్రిటానికా 'యందు ప్రాచ్యవిజ్ఞానమునకును, హిందూస్థాన మునకును, వైదిక విజ్ఞానమునకును సంబంధించిన విషయ