పుట:ఆంధ్ర-విజ్ఞాన-సర్వస్వము-1.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపుటములు C౯౧౬ - ౧౭ లందు సంచికల రూప మునను క్రమముగ వెలువడినవి. ఈ మూడు సంపుటము లందును ' అ ' నుండి ' అహ్రి' వ కు అక్షరాను క్రమ ముగ గల పదములకు సంబంధించిన విషయముల వ్యాస ములు గలవు. నాల్గవ సంపుటము నాంధ్ర సంపుటముగ ప్రచురించుటకు లక్ష్మణరావుగారు సంకల్పించి సాధన సామగ్రిని సమకూర్చుచుండిరి. కొన్ని కారణములవలన వారిసంకల్పమున కంత రాయములు గలుగుటయును, వారు 3 నందు కాలధర్మమును పొండుటయును, తదనంత రము ప్రచురణము నిలిచిపోవుటయును సంభవించినవి. దేశభాషాహితైషుల యభిమతానుసారముగ లక్ష్మణ రావుగారు తలపెట్టిన ఆంధ్ర సంపుటమును ప్రచురించు టకు పూనుకొనుట తటస్థించినది. ఈ పూనిక యనాలోచిత కార్యోప క్రమణ మని అనుభవము విశదము చేసిన ది. కార్యారంభమునందే సంకల్పమునకును, నిర్వహణమున కును దుస్తరావాంతరము లావిర్భవించినవి. ఆర్థికవ్యవహా రాదుల నిర్ణయములందును కాలహరణము కలిగినది. ఆంధ్ర సంపుటమునకు లక్ష్మణరావుగారు సమ కూర్చిన సాధన సామగ్రులు పరిశీలనానంతర మసమగ్ర ముగ గనుపడినవి. అసమగ్రమైన విషయమును పూర్తి చేయుటకు లక్ష్మణరావుగారితో గలసి పనిచేసిన శ్రీయుతులు వేమూరి విశ్వనాథశర్మ, మల్లంపల్లి సోమ శేఖరశర్మ, కానూరి వీరభద్ర రావుగారులు మొదలగు మహాశయులు పూనుకొనిరి. లక్ష్మణరావుగారు సమ కూర్చిన సాధన సామగ్రి యంతయును టీకా టిప్పణ వృత్తిరూపమున నసమగ్రమై వారు స్వయముగ వ్యాస ములను పూర్తిచేయుట కనుకూలముగ నున్నను నితరులు పూర్తిచేయుట కనుకూలముగ నుండదయ్యెను.గతించిన యిరువ దేండ్లయందును ప్రపంచవ్యాప్త మైన మహా ప్రబోధ మాంధ్ర హృదయ క్షేత్రమునం దును సంకురించినది. ఆంధ్ర హృదయ క్షేత్రమునందును, సాహిత్యశిల్పకళాశాస్త్రపరిశోధన రచనలందును, రాజ కీయ సాంఘి కార్థికమతవ్యవహార ధర్మములందును ప్రబోధ ప్రత్యభిజ్ఞానము లంకురించినవి. పునర్నిర్మాణ సమయము నందు లక్ష్మణరావుగారు సమకూర్చిన సాధన సామగ్రి నాధారము చేసికొని వారి పేరున నితరులు క్రొత్తసంపుటము లను ప్రచురించుట లక్ష్మణరావుగారి సంకల్పమునకును, ప్రతిష్ఠ కును భంగకరముగ నున్నది. లక్ష్మణరావుగారు సమ కూర్చిన సాధన సామగ్రికి సాంగోపాంగములగు రూప రేఖా విలాసములను గల్పించుటకు లక్ష్మణరావుగారే సమర్థులు. ఆంధ్ర సంపుటమునకు లక్ష్మణరావుగారు సమకూ ర్చిన సాధన సామగ్రి యమూల్యమైనను దాని ప్రయోజ నము నిర్వాహకుల సంస్కారముమీద నాధారపడియు న్నది. ఆంధ్ర సంపుటము వర్తమాన దేశ కాల పరిస్థితుల కును, నిర్వాహకుల సంకల్ప సంస్కారములకును నను రూపముగ నుండుటకు సంపుటములు నూతన రూపభావ విలసితములు గావలసిన యవసరము సంభవించినది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వముయొక్క మొదటి సంపు టము ౧౯౧౫ నందు, రాయలు 6 పుటలు యాకృతిని 'గ్రేటు ప్రయిమరు టైపు'తో ముద్రింపబడినది. తరు వాతీ మాససంచికలు సంపుటముల రూపమును దాల్చు నపుడు భావరూపానుసంధానమునందును, వ్యాసరచన యందును సామరస్యము గలుగుట దుర్లభము. ఆ సంపుట ములును వ ర్తమాన కాలమునం దలభ్యములు. గతించిన పదిదేండ్లయందును ముద్రణకళయందును, ముద్రణ యంత్ర సాధనములందును, పటములనిర్మాణ ముద్రణము