పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమనిక

శైవాచార్యుల పట్టి నిచ్చుటలో నీ దిగువవారు పొరపాటున చేర్చబడలేదు. వారినిగూర్చిన వివరణ మీ దిగువ నిచ్చుచున్నాము.

1. అ. ఉద్భటారాధ్యులు:- వీరిది భారద్వాజసగోత్రము. వీరు కాశ్మీర రాజగు జయాపీడుని సభలో క్రీ. శ. 569 నుండి 620 వరకు 'విద్యాపతి'గా నుండిరి. వీరిని గురించి తెనాలిరామలింగకవికృతమగు నుద్భటారాధ్య చరిత్రమున గలదు.

ఇ. మరులసిద్ధుడు:- వీరిది భారద్వాజసగోత్రము. వీరు మహారాష్ట్రమున మరులసిద్ధమఠము నేర్పఱచిరి.

శ్రౌతశైవము నుద్ధరించి ప్రచార మొనరించిన శైవాచార్యులు పెక్కురుండినను వారిలో ప్రసిద్ధివహించినవారు పండ్రెండుగురు కలరు. వారు వరుసగ 1. సిద్ధత్రయము 2. పండితత్రయము 3. ఆరాధ్యత్రయము 4. ఆచార్యత్రయమని వ్యవహరింప బడుచుండిరి.

1. సిద్ధత్రయము:- రేవణాసిద్ధ, మరులసిద్ధ, ఏకోరామసిద్ధులు.