పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. పండితత్రయము:- శ్రీపతి పండిత, మల్లికార్జునపండిత, మంచెన పండితులు.

3. ఆరాధ్యత్రయము:- ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్యులు.

4. ఆచార్యత్రయము:- నీలకంఠాచార్యులు, హరదత్తాచార్యులు, భాస్కర భట్టాచార్యులు.

వీరిలో హరిదత్తాచార్యుల స్థానమున మాయిదేవాచార్యులను గొందఱు చెప్పుచున్నారు. సిద్ధత్రయ, పండితత్రయ, ఆరాధ్యత్రయముల విషయమున మాత్రము వివాదములేదు.


__________________________________________________________________________________________________________

జయాపీడునికాలము 8 వ శతాబ్దముగ వాడుకలో నున్నది. అదిపొరపాటు. (Vide Chronology of Kashmir History Reconstructed By Bharata Charitra Bhaskara Vimarsakagresarulu, Pandita Kota Venkatachalam.)