పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రవంశ క్షత్రియుడగు యయాతిచక్రవర్తి వంశపరంపరలో వచ్చిన రాజులు భారతదేశములోని వివిధరాష్ట్రములకు రాజులై అదివరకాదేశములకు గల ప్రాచీన నామములను మార్చి తమతమ పేరుల నాయా దేశములకుంచి రాజ్యములు చేసియుండిరని పురాణములు వివరించు చున్నవి. ఆ వివరములు క్రింద చూపబడుచున్నవి.

రాజనామములచే పిలువబడిన దేశములు - ప్రజలు.

వరుస నెంబరు రాజుపేరు రాజ్యమునకు పెట్టినపేరు ప్రజలకుకలిగిన నామము
1 యయాతికుమారుడు యదువుసంతానములో యయాతినుండిఏడవ వాడు కుంతలుడు కుంతలదేశము కుంతలులు
2 డిటో, తొమ్మిదవవంశమువాడు మహీష్మంతుడు మహిష్మతీపురము మాహిష్మతులు
3 డిటో, క్రోష్టువు వంశములో యయాతినుండి పదిహేనవ తరమువాడు విదర్భుడు విదర్భదేశము విదర్భులు
4 డిటో, విదర్భుని వంశములోని వాడును యయాతినుండి యిరువదవతరము వాడగు చేది చేదిదేశము చైద్యులు
5 యయాతి కుమారుడు పూరుని వంశములో యయాతినుండి ఇరువదిరెండవ తరమువాడు హస్తి హస్తినాపురము