Jump to content

పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వరుస నెంబరు రాజుపేరు రాజ్యమునకు పెట్టినపేరు ప్రజలకుకలిగిన నామము
6 యయాతి కుమారుడు పూరుని వంశములో యయాతి నుండి 26 వ తరమువాడు 'ఋక్షుని' సంతానములో యాయతినుండి యిరువదియారవ తరములోనివాడు కురు. కురుక్షేత్రము కౌరవులు
7 యయాతి కొడుకు ద్రుహ్యునివంశములో యయాతినుండి ఐదవతరమువాడు గాంధారుడు గాంధార దేశము గాంధారులు
8 డిటో, పదవవంశములోని సంతానము నూరుమంది మధ్యాసియాలోని మ్లేచ్ఛ క్షత్రియుల దేశప్రభువులైన వారు యవన, బాహ్లిక, తురుష్క, (టర్కీ), శక, పల్లవ, కంపిల (కాబూలు ఆదిగాగల మ్లేచ్ఛదేశములు) యవనులు, బాహ్లికులు, తురుష్కులు, శకులు, పల్లవులు, కాంపిలులు (కాబూలీలు)
9 యయాతికొడుకు అనువు వంశములో యాయతినుండి పదవతరమువాడు ఉశీనరుడు ఉశీనరదేశము ఉశీనరులు
10 యయాతికొడుకు అనువువంశములో పన్నెండవ తరమువాడు వృషదర్భుడు వృషదర్భ దేశము వృషదర్భులు
11 డిటో, పండ్రెండవతరములోని రాజులు సువీర సౌవీరము సౌవీరులు