పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున అది యథార్థ చరిత్ర యనిపించుకొనదు. అది చరిత్రకు ద్రోహముచేయుట యగును.

ఇప్పుడు పాశ్చాత్య ప్రాచ్య చరిత్రకారులచే వ్రాయబడిన ఆధునిక భారతదేశచరిత్ర లనున వన్నియు వారివారి యూహా కల్పితములై యున్నవి. అందు సత్య మావంతయును కానరాదు.

మానవజాతి మధ్యాసియాయందు పుట్టి భూగోళమంతటను వ్యాపించిన దనెడి వాదము పాశ్చాత్యచరిత్రకారుల యూహాపోహలతో కల్పింపబడినది గాని దానికి పూర్వచరిత్రాధార మేమియు లేదు. ఒక చరిత్రకారుని యూహ మరియొక చరిత్రకారుని యూహకు ప్రమాణమై తాము ముందుగా నిర్ణయించుకొనిన యొక నిర్ణయమున కనుకూలముగా నుండునట్లు పర్యవసానము తేల్చబడి లోకమున ప్రచారము చేయబడినది. చిరకాలము వినగా వినగా అదియే సత్యమైన చరిత్రయని లోకులు భ్రమించి దాని ననుసరించి చరిత్రలు వ్రాసికొనుచుండిరి. పాశ్చాత్యులచే వ్రాయబడిన అట్టి కల్పితకథలే భారతదేశచరిత్ర కాధారభూతమై తదనుసారముగా నాధునిక చరిత్రలు వ్రాయబడి మనకు పాఠశాలలో నేర్పబడుచున్నవి. వీనిని విసర్జించి మనము మనవాఙ్మయాదుల ననుసరించి యథార్థచరిత్రలను వ్రాసికొనుట అత్యావశ్యాము.

సృష్టిక్రమము

ఇప్పటి సృష్ట్యాదియందు ప్రకృతినుండి స్వాభావికముగా పంచభూతములును, అందు భూమినుండి ఓషధులును, ఓషధులనుండి సర్వ భూతకోటియు దేవమానవాదివర్గములు క్రమక్రమముగా నుద్భవించినవి. అందు మొదట వచ్చినది ప్రజాపతి. ఇతడు ప్రథమ ఆర్యుడని ఋగ్వేదము 4-26-2-2; 2-11-18 ఋక్కులయందు వినబడుచున్నది. ప్రథమ ఆర్యుడైన స్వాయంభువప్రజాపతి మానవసృష్టిని జేయబూని వసిష్ఠాదులైన పదిమంది ప్రజాపతులను (వీరికి దేవఋషులని పేరు)