పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఊహలు గాని, సిద్ధాంతములు గాని జరుగుచుండిన లేక జరిగిపోయిన సంభవములమీద పనిచేయనేరవు.

చూచినది చూచినట్లు, వినినది విన్నట్లు, ప్రాచీనచరిత్రలలో తాను పఠించినది పఠించినట్లు నిబంధించుటయే చరిత్రకారుని ధర్మము. తనకు తెలియనిది తెలియనట్లు, సందిగ్ధ విషయములు తనకు సందేహము లున్నట్లు స్పష్టపరచి చెప్పుటయే ఉత్తమ చరిత్రకారుని లక్షణము. అట్లుగాక ముందుగా తానొక నిర్ణయము చేసికొని తన నిర్ణయమును సమర్థించుకొనుట కనుకూలముగా ప్రాచీన చరిత్రలను వ్యాఖ్యానించుటయు, అందు కనుకూలముగా నుండులాగున అసత్యకల్పనలు చేసి యతికించుటయు, తన ఊహాపోహలతో గూడిన సందేహ వాక్యములతో చారిత్రక కాలములను, విషయములను ఒక నిర్ణయమునకు దెచ్చి అదియే సత్యచరిత్ర యని ప్రచారించుటయు మొదలగునవి చరిత్రకారులకు ప్రతిష్ఠనీయజాలవు. కాలక్రమమున అట్టివారివ్రాతలు లోకమువలన నిరసింపబడి విసర్జింపబడగలవు.

ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములు

ఒకదేశముయొక్క గాని, జాతియొక్క గాని చరిత్ర వ్రాయుటకు ప్రాచీనకాలమునుండి వచ్చుచుండిన సంప్రదాయముగాని (Tradition ) లేకవ్రాతమూలకమైన పూర్వచరిత్రగాని ఆధారముగా నుండవలెను. అట్టిదేమియు లేక కేవలమొక మనుష్యునియొక్క ఊహలు, కల్పనలు, నమ్మకములు, సంభావ్యతలు ( Probabilities or possibilties ) మొదలగువానితో వ్రాయబడినవి సత్యమైన చరిత్రలు కాజాలవు. అవి కల్పనాకథ లనిపించుకొనును.

ఏదియో యొక వార్తను విని దానిని తనయూహలతోను, కల్పనలతోడను పెంచి ప్రస్తుతము తన యనుభవములోగల యొకవిషయమున కదుకుపెట్టి తాను మొదట వినిన వార్తయొక్క యథార్థ చరిత్ర యిదియేయని గ్రంథములల్లి లోకములో ప్రకటించినంతమాత్ర