పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

27

చేసుకొనే కుండలు, గుడిసెలవంటి కట్టడములు కానవచ్చినవి. వీని వలన వ్యావసాయక సంఘముల ప్రారంభ దశ, సంస్కృతి విశదమగుచున్నది.

చరిత్ర శాఖ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్రశాఖ ద్వారా "ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి" అను అంశములపై జరుగుచున్న కృషి:

1. ఆంధ్రుల చరిత్ర:

1. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు

(అ) ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము

(ఆ) తెలుగు సంస్కృతి (తెలుగు విజ్ఞాన సర్వస్వము - 3వ సంపుటమునకు ముఖ్య సంపాదకులు)

(ఇ) చారిత్రాత్మక వ్యాసములు

2. శ్రీ సి. సోమసుందరరావుగారు

(అ) ఆంధ్ర చరిత్ర (క్రీ.శ. 1336 వరకు ఆంగ్లంలో రచింపబడుచున్నది)

(ఆ) ఆంధ్ర రాజవంశ చరిత్ర (క్రీ.శ. 16వ శతాబ్దము వరకు) (వ్యాసము - 'South Indian Studies' లో అచ్చులో నున్నది)

3. డా.ఇ. సూర్యనారాయణ మూర్తిగారు

ఆంధ్ర చరిత్రలో చారిత్రక పద్ధతి

4. శ్రీ బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు

(అ) ఆంధ్రుల చరిత్ర

(ఆ) ఆంధ్ర దేశములోని మతములు

(a) శాతవాహనులు, తరువాతివారు:

1. శ్రీ గొర్తి వెంకట్రావుగారు

శాతవాహనుల చరిత్ర ('దక్కను ప్రాచీన చరిత్ర' లోని భాగములు)

2. శ్రీ రామప్రోలు సుబ్రహ్మణ్యంగారు

(అ) విష్ణుకుండి విక్రమేంద్రవర్మ తుండి శాసనము

(ఆ) ఇక్ష్వాకు నాణెములు

3. ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్యగారు

(అ) ఆంధ్ర శాతవాహన కాల నిర్ణయము (జదునాథ్ సర్కార్ సంపుటము)