పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

సంస్కృత శాఖ

గ్రంథములు:

ఆంధ్రులు - సంస్కృత వాఙ్మయము

రచయిత : డా.పి. శ్రీరామమూర్తిగారు

ఆంధ్రులు సంస్కృతభాషలో రచించిన గ్రంథాలగురించి యిందులో వివరింపబడ్డవి.

మానవశాస్త్ర శాఖ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మానవశాస్త్ర శాఖ (Anthropology Department) ద్వారా "ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి" - అను అంశములపై జరుగుచున్న కృషి:

డా.కె. తిమ్మారెడ్డి, శ్రీ బి. సుదర్శన్, కుమారి నసీం మియాద్ మొదలగు వారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతములలో జరిపిన పరిశోధనల వలన ఆంధ్రదేశ చరిత్ర పూర్వయుగపు సంస్కృతి తెలియుచున్నది.

భారతదేశములో అంతకు పూర్వము లభించని ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతి, కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల వద్ద త్రవ్వుట వలన వ్యక్తమగుచున్నది.

విశాఖపట్టణ సమీఈపమున నున్న మధురవాడ వద్ద త్రవ్వుటవలన ఆ ప్రాంతపు వ్యవసాయదారుల సంస్కృతి తెలియుచున్నది.

కర్నూలు, కడప, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాలలో భూమిపై నున్నవానివలనను, త్రవ్వుటవలనను, లోహయుగమునకు పూర్వపు శిలాయుగ సంస్కృతులు క్రిందిని పేర్కొనుచున్న వానివలన తెలియుచున్నవి:

(1) పూర్వపు ప్రాచీన శిలాయుగము నాటి చేతి గొడ్డళ్లు, గులకరాతి పనిముట్లు, క్లీవర్లు, గోకుడురాళ్లు లభించినవి.

(2) మధ్యప్రాచీన శిలాయుగము నాటి పలురకములైన గోకుడురాళ్లు, మొనలు, బోరర్లు దొరికినవి.

(3) ఉత్తర ప్రాచీన శిలాయుగము నాటి బ్లేడ్లు, బ్యూరిన్లు, వాటితోపాటు ఎముకతో చేసిన గోకుడురాళ్లు, మొనలు, ఉలి కొనవంటి పరికరములు లభించినవి.

(4)మధ్య శిలాయుగమునాటి మిక్కిలి చిన్న పనిముట్లు విరివిగా దొరికినవి.

(5) నవీన శిలాయుగమునాటి నునుపురాతితో చేసిన గొడ్డళ్లు, బడిసెలు, ఉలులు దొరికినవి. మరియు నిత్యోపయోగకరములైన కుండలు, వస్తువులు నిలువ