పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

25

ఆంధ్ర వాఙ్మయాభివృద్ధికి సంస్థానాదీశ్వరులు ఏవిధంగా దొహదంచేశారో వారి యాస్థానాల్లో ఏ యే కవులు ప్రసిద్ధులై కావ్య రచన సాగించారో, యీ గ్రంథంలో సమగ్రంగా వివరింపబడి యున్నది. దీనికి ఆంధ్ర సాహిత్య అకాడమీవారి బహుమతి లభించినది. ఈ గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు ప్రచురించిరి.

4. భాషా చారిత్రక వ్యాసావళి

రచయిత : ఆచార్య తూమాటి దొణప్పగారు

భాషా చరిత్రకు సంబంధించిన వివిధ వ్యాసములు ఇందులో గలవు.

1. నన్నయ - అస్యదేశ్యాభాసములు

2. శ్రీనాథ యుగము - అన్యదేశ్యములు

3. ఆంధ్రభాష - హకారాది పదములు

4. తెలుగులో బుడతకిచు నుడులు

5. మరాఠీలోని తెలుగు నుడులు

6. తెలుగు నందలి కృతక ప్రామాణిక రూపములు

అను వ్యాసములు ఆచార్య దొణప్పగారి పరిశోధనా పాటవాన్ని ప్రకటిస్తున్నాయి.

5. తెలుగులో వెలుగులు

రచయిత : ఆచార్య తూమాటి దొణప్పగారు

1954వ సంవత్సరంనుండి డా.దొణప్పగారు చేసిన రేడియో ప్రసంగాలలో 20 ప్రసంగాలు ఇందులో ప్రకటింపబడినవి. తొలి 6 ప్రసంగాలు శిష్టసాహిత్యానికి, తరువాతి 6 ప్రసంగాలు జానపద సాహిత్యానికి, తక్కిన 8 ప్రసంగాలు భాషావిజ్ఞానానికి సంబంధించినవి.

6. జానపద కళాసంపద

రచయిత : ఆచార్య తూమాటి దొణప్పగారు

ఆంధ్రుల సంస్కృతికి జానపద సాహిత్యం దర్పణం వంటిది. డా. దొణప్పగారు ముప్పదేండ్లుగా ఈ సాహిత్యంలో కృషిచేస్తున్నారు. ఆ కృషి ఫలితమే యీ గ్రంథం.

తత్త్వశాఖ

ప్రచురణలు:

1. నాగార్జునుడు

రచయిత : ఆచార్య కె. సచ్చిదానందమూర్తిగారు

ప్రచురణ : నేషనల్ బుక్ ట్రస్ట్, ఢిల్లో.

ఈ గ్రంథములో బౌద్ధాచార్యులలో ప్రసిద్ధుడును, మహాయాన ప్రవక్తయు అయిన నాగార్జునుని గూర్చి సమగ్రముగా వివరింపబడినది.