పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
24

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

వివరింపబడి ప్రప్రథమముగా శిష్ట వ్యావహారిక భాషలో సంగ్రథితమైన సిద్ధాంతవ్యాసము.

27. 'ధూర్జటి రచనలు - సమగ్ర పరిశీలనము' (1974)

రచయిత : డా. గోరంట్ల మదనమోహనరావుగారు

ధూర్జటి జీవితాదికములు, అతని వంశవృక్షము, రచనలు, వానిమూలములు, కవితాసౌందర్యము, పాత్రపోషణము, భాషావైశిష్ట్యము, క్షేత్ర మహాత్మ్యములలో కాళహస్తి మహాత్మ్యమునకు గల స్థానము, మున్నగు నంశములు సమీక్షింపబడిన సిద్ధాంతవ్యాసము.

ఆచార్య టి. దొణప్ప, ఆచార్య కె.వి.ఆర్. నరసింహం, డా.సి. సుబ్రహ్మణ్య శాస్త్రి, డా.యల్. చక్రధరరావుగార్ల పర్యవేక్షణలో ఈ యాంధ్ర శాఖలో పలువురు భాషా వాఙ్మయములపై పరిశోధన చేయుచున్నారు. అనుబంధ కళాశాలలలో పనిచేయుచున్న అంధ్రోపన్యాసకులుకూడ పరిశోధన చేయుచున్నారు. గ్రంథవిస్తర భీతిచే వారిని గూర్చి యిఁట వ్రాయలేదు.

పి.జి. సెంటరు గుంటూరులో ఆచార్య యస్వీ. జోగారావుగారు, డాక్టరు కె.శ్రీ రామమూర్తిగారు పర్యవేక్షకులుగా నుండి ఆంధ్ర సారస్వతములోని కొన్ని ముఖ్య విషయములపై పరిశోధన చేయించుచున్నారు. కాలవ్యవధి లేనందువలన, అచ్చటి సిద్ధాంత వ్యాసముల విషయ సేకరణ చేయలేక పోయినందువలన ఇందులో చేర్చలేదు.

ఆంధ్రుల సంస్కృతి గురించి వ్రాసిన ప్రత్యేక గ్రంథములు :

1. దక్షిణాంధ్ర వాఙ్మయ చరిత్ర (మొదటి భాగము ముద్రితము, 1951)

రచయిత : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

తంజావూరు, మధుర, పుదుక్కోట రాజ్యాలలో నాయకరాజులు పరిపాలించి, ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్ర సాహిత్యమును అనేక విధాల పోషించేరు. ఈ గ్రంథంలో తంజావూరు నాయకరాజుల సారస్వతసేవ సమగ్రంగా వివరింపబడినది.

2. సాహితీ సమీక్ష

రచయిత : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఇది సారస్వత వ్యాసముల సంపుటి. శ్రీనాథుడు మొదలైన ప్రాచీన సవుల గ్రంథాలేకాక అత్యాధునికులైన గురజాడవారి కావ్యములుకూడ ఇందులో సమీక్షింపబడియున్నవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రచురణ.

3. సంస్థానములు - సాహిత్య పోషణము

రచయిత : ఆచార్య తూమాటి దొణప్పగారు