పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

23

21. 'ఆంధ్ర వాఙ్మయము - రామాయణము' (1971)

రచయిత్రి : డా.ఎ. మలయవాసినిగారు

పర్యవేక్షకులు : డా.కె. శ్రీరామమూర్తిగారు

ఆంధ్ర వాఙ్మయములో వెలసిన రామాయణము లన్నింటి గూర్చి చేయబడిన సమగ్ర పరిశోధన యిది.

22. 'ఆంధ్ర వాఙ్మయముపై గాంధీతత్త్వ ప్రభావము' (1973)

రచయిత : డా.వి. అంకయ్యగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఇందులో జాతీయోద్యమము, గాంధీతత్త్వము, ఆంధ్ర కవిత్వముపై దాని ప్రభావము వివరింపబడినవి.

23. 'ఆంధ్ర వాఙ్మయము - చారిత్రక కావ్యములు' (1974)

రచయిత్రి : డా.బి. అరుణకుమారిగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఇది ఆంధ్ర వాఙ్మయంలోని చారిత్రక కావ్యముల సమగ్ర పరిశోధన.

24. 'మహా భారతము - ఉపాఖ్యాన తత్త్వము' (1975)

రచయిత : డా.పి. వెంకటరాజుగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

మహాభారతంలోగల వివిధ ఉపాఖ్యానము లందలి తత్త్వము ఈ సిద్ధాంత వ్యాసములో సప్రమాణముగా నిరూపింపబడినది.

25. 'మెకంటీ కైఫీయత్తులలోని అన్య దేశీయ శబ్దములు' (1970)

రచయిత : డా. రాళ్లబండి శ్రీరామశాస్త్రిగారు

పర్యవేక్షకులు : ఆచార్య టి. దొణప్పగారు

మెకంజీ సంకలసము లను పేర ప్రశస్త్రి ప్రచారముల నందిన స్థానిక వృత్తాంతముల (local records) లో ప్రయోగింపబడిన ఉర్దూ, మరాఠీ మున్నగు అన్యదేశీయ శబ్దముల స్వరూప స్వభావాలను సమ్యక్పదర్శనము గావించిన సిద్ధాంత వ్యాసము.

26. 'తెలుగులో కవితా విప్లవ స్వరూపము' (1974)

రచయిత : డా. వెల్చేరు నారాయణరావుగారు

పర్యవేక్షకులు : ఆచార్య టి. దొణప్పగారు

వేయేండ్ల తెలుగు సాహిత్యములో ఆయాయుగాలలో కవితా వస్తువు విషయముగా ఛందఃపరముగ ప్రపర్తితమైన విప్లవధోరణులను ప్రాక్ప్రతీచీ విమర్శనాధారతో