పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగదే అంగదే

లేక చంపానగరమని మార్చఁబడెననియు నొక ప్రతీతిగ కొందరు వాడుకసాగించిరి. కాని మహాభారతము వనపర్వమున రోమపాదుని రాజధాని చంపాపురమని యుంట, ఇది నిరా ధారమని తేలుచున్నది. కర్ణభూపతికాల మున చంపకవృక్షము లీపురిపరిసరముల నిండియుట మహాభారతమున ప్రశంసింపఁ బడినది. మరియు కర్ణునకు గంధలతాభ వనమని యొక ప్రాసాదమును, క్రీడా స్థలి యనంబడు వేరొక ప్రాసాదము నుండెనట. గంధలతాభవనపు పాడుగ భాగల్పూరునకు ప్రాద్దిశగ నేడుమైళ్లలో కార్పాతను గ్రామము శడ నౌక దిబ్బను, క్రీడాస్థలి పాడుగ భాగ ల్పూరు సమీపమున్న గంగాకోళీనదుల సు గమముకడ పాతర్హిటాయనంబడు తావుకడ నౌక తావును జూపెదరు. అంగదేశము నాకు రాజధాని చంపాపురము లేక చంపా నగరమునని చెప్పఁబడినది. ఇది బంగాళ ములోని భాగల్పూరునకు నాల్గు మైళ్ల దూరమున నుండెను. ఇందు కర్ణుడు నివ సించిన కోట, పాడు దిబ్బయై కర్ణఘడ్ యను బరగుచున్నది. ఈ పాడుపడిన నగరమున మానక్షమానన్ద శివలింగము కలదిది కర్ణ ప్రతిష్ఠితమని చెప్పబడినది. ఈ దేవస్థానము పరిసరములు బౌద్ధవిగ్రహములచే నిండి -యుంట, బౌద్ధమతాధికారకాలమున నిది జా “ర్ధానమై యుండియుండనోపు ననియు తలంపఁబడుచున్నది. ఇటంగల బౌద్ధని త్రము నకు చంపానగర్, లేక చంపానాగోర్ అని పేరు. ఇది జైనమత స్వామియు తీర్థకరుల పండ్రెండవవాడునగు వసుపూజ్య నాధు 'డిట జన్మిన్చుట, మృతినందుటం జేసి ఇది జైనుల యాత్రాస్థలమును గూడనైనది..

వసుపూజ్యనాధుని సమాధిపై నాత (నాత్ నగరము) గరనుబకు తావున దిగంబర జైనుల దేవళముకలదు. అది యుధిష్ఠిరశకము ౨గి సంవత్సరమున జయపుర సంస్థానాధి పతియగు నొక భూపాలుడు నిర్మింపజేసెనని యొక పాటలీపుత్ర శాసనమున కలదు. ఇంకను మల్లినాధ, పరశునాధ, వర్ధమానస్వామి విగ్రహములు శ్రీ. వె౧౨3-౧౨౫౭ సంవత్సరములనడుము ప్రతిష్ఠింపబడినవి. ఒక అజమీరు శాసనమునకలదు. జైనతీర్థకరు లలో కడపటివాడగు మహావీర స్వామి ఇట మూడు పర్యూషణములు (పర్యూషణమన వర్షాకాలనివాసము) గడపెనని చెప్పఁబడినది. ఆ మహావీరాస్వామి శిష్యుడై యాయనకుం బిదప మతాధిపతియైన సుధర్మ స్వామి యాలయమిట నుండెననియు ఆ మహనీయుం డీటకు యజాతశత్రుశృపతి పాలన కాలమున నేతెంచి కొంతకాల మీటవసించెననియు, వారి కింబిదప మతాధిపతులగు జంబూనాథస్వామి యు, ప్రభవనాధస్వామియు, స్వయంభువ నాధస్వామియు ఈగే త్రముం దర్శించిరనియు, స్వయంభువనాధస్వామి ఇచట వసించుతరినే దశ వైశాలిక సూత్రమను గ్రంథము రచించెన నియు, అది జైనమతసిద్ధాన్తసారమనంబడు దశ ప్రథానోపన్యాసములగుడు దనరెడ్డి నని యు స్థవీరావళి పరిశిష్ఠ పర్వమునందు చెప్పఁబడి నది. చంపానగరపు పాడుదిబ్బలమధ్యమున నే స్వేతాంబర జైనుల దేవస్థానమును ఒకటికలదు. చంపానగరముకడ, గంగానదిలో సంగ మించునదికి చంద్రావతీయని పేరు. దీనినిప్పుడు చందన్ నదియనియు, అంధేలాయనియు అను చున్నారు. అంగదేశాధీశుడగు' పృధులా శ్వుని సుతుఁడగు చంపమహారాజు, చంపా