పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకోల అంగదే

అంకోలముచెట్టు అంగలౌకికదేశము - వితస్థా (జీలమ్) నది చంద్రభాగ (అశిక్నీ) నదితో సంగమించు తావునకు దిగువ నుండునని తలంపఁబడుచున్న దేశము, బ్రహ్మాండ పురాణము అధ్యాయమున బ్రశంసింపఁబడిన దేశము. మహాలగ్జాండరుయొక్క గ్రీకు చరిత్రకారులు ఈ దేశపు బ్రజలను 'అంగ లెసియను' అని వ్రాసిరి. దీనింగూర్చి సరిగా తెలియదు. అంగటిలోని బెల్లము గుడిలోని దేవునకు నైవేద్యము – ఆంధ్ర అంగట్లో అన్ని వున్నని కాని అల్లుని నోటిలో శనియున్నది — అల్లుని పై . - గోపమువలన అత్త గారు సరిగా వండిపెట్టదని భావము. ఆంధ్రలోకో క్తి. అంగదదేశికుడు . . ఈతడు శిక్కు మత - గురువులలో రెండవవాడు. నానకు దేశికుని తర్వాత గురుపీఠ మధిష్ఠించినవాడు. తండ్రి దీర్మల శ్రీ, తల్లి శుభరాయీజీదేవి. _olor లో వివాహమాడినవాడు. నానకు జగద్దేశికుని శిష్యుండాయెనట. జన నము గింర అనియు, మృతి యనియు చెప్పంబడినది. సమాధి ఖండార యను గ్రామమునందున్నది. జాతీయనియు, సత్యసంధుఁడనియు పేరందిన వాడు. నానకు "దేశకులకు పుత్రులున్నను యీతని యర్హత నెంచి యీతని కంగద నామము నిచ్చి, గురు పీఠ మధిష్టింపంజేసెనట. ఈ మహాత్ముని 'తొల్లింటి నామము లహనుడట. అంగదుడు వాలి కుమారునకందుడని -- వాలి కిష్కి... ధపురాధీశుడు. మరియు

శ్రీ రామసోదరుండగు లక్ష్మణుని వ్యవ పుత్రుం డంగడు డొకడు కలడు. అంగదేశము ఇప్పటి భాగల్పూరు, మాంఘీరుల ప్రానదేశము తొల్లింటి యంగ దేశ మని పోల్పఁబడినది. దీనియెల్లలు సరిగా తెలియరావు. ఒకప్పుడు సరయూనది సంగమించు రావుదనుక వ్యాపించియుండెనని బలమగు ప్రతీతి కలదు. వీరభూమి (Birbhum) మూర్హ డాబాదు జిల్లాలుగ నిక్కాలమునఁ జెప్పఁబడు ప్రాప్త ములు కూడ సంగ దేశమునందు జేరియుండె నని Sir George Birdwood అను చరిత్రకారుడు దెల్పియున్నాడు. బంగాళ ములోని సంతాల్పరగణా లిందులోనివని కొందరు చరిత్రకారులనిరి, కాని బలమగు నిదర్శనములు గానవచ్చుట లేదు. అంగదేశ మను పేరుం గూర్చి రెండు కథన ములు కలవు. వేనుని కుమారుఁడగు అంగుని వలన నీ పేరు కల్గెనని బలమగు యొక ప్రతీతియు, మన్మధునియుగము శివ నేత్రా గ్నిచే దహింపఁబడిన దాదిగ నీపేరు కల్గెనని యొక ప్రతీతియుఁ గలదు. రామాయణము బాలకాండ మీూ రెండవకథనము నెసూచించే డిని, ఎటులనైనను అధర్వసంహిత పంచమ కాండము, చతుర్థళానువాకమున అంగదేశ ము ప్రశంసింపఁబడియుంట, నిది పురాతనమని చెప్పక తప్పదు. ఈదేశమును రోమపా దుడు పాలించెనని 'రామాయణమునను, కర్ణుడు పాలించెనని భారతమునను చెప్పఁబడినది.. రోమపాదునికాలమున రాజధానికి మాలినీ. పురమని పేరుండెననియు, అతని ముమ్మను. మడు చంపానృపతిపాలనమున చంపాపురము.