3
(V) మరియొక గొప్ప విషయము.... హిందూ దేశముయొక్క ప్రాచీన చరిరా)త్మకములైన స్థలములను ఈ కృతికర్త స్వయముగ పర్యటనముగావించి, వర్ణించుట; ఇందుకు దృష్టాంతము అంగదేశము గూర్చి వ్రాయబడిన వ్యాసమే. వీ రీస్థలమునకు వెళ్ళి చూచిరి. గ్రంథములలో వర్ణింపబడిన దాని కనుగుణముగా 'నెత వరకున్నదో కనుగొనిరి. సుశిక్షిత మైన తమబుద్ధినివికసింప జేసికొని, తమమనోవీధిని తామెంతదూరము సృష్టింపగలిగితో, అంతవరకును సృష్టించిరి; దానిని మన ఊహా ప్రపంచమునం దెన్నటికిని మరపు రాని, వినశ్వరమైన కర్ణుని దానరాజ్యముగా తన వర్ణనములో కవిగారు పునర్నిర్మాణ మొనర్చిరి. i) అయిదవది: అగణితసౌందర్యముగల తెనుగు గవ్యరచనా నైపుణి. ఈ ఆంధ్ర విజ్ఞానముకూడ ఒక సారస్వతమే. మరేయితర గుణాతిశయమునకు కాకున్నను, ఎన్నింటికిని నాశ నములేని ఆగద్యరచనా సౌందర్యమే చాలు ఆ గ్రంథరాజముయొక్క అజరామరత్వమునకు! తెనుగు వాఙ్మయములో మొట్టమొదటి ఆంధ్రవిజ్ఞానసర్వస్వము మ. శ్రీ. కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారును, వీరిమిత్రులును, కలిసి రచింప ప్రయత్నించిరి. ఆప్రయత్నములో నేనుకూడ నాకు "తెలిసినంత కించిద్ జ్ఞానముతో ఒక సలహాదారుడనుగా నుంటిని. మైసూరు మహారాజావారు నా ప్రార్థన పై అగ్రంథమునకు రాజపోషకులుగానుండి, ప్రకటితమైన ప్రతిసంపుటమునకును రూ.300-లు చొప్పున విరాళమిచ్చుటకు వాగ్దాన మొనర్చిరి; కాని మన దురదృష్టమువలన ఆ గ్రంథము యొక్క మూడు సంపుటములు ప్రచురింపబడిన పిదప శ్రీ. కొ॥ వేం లక్ష్మణరావుగారు కీర్తి శేషు లైడ్ ఇయ్యది తెనుగుచరిత్రకును, తెనుగు నాఙ్మయమునకును అపారమైన నష్టము కలుగ జేసినది. అనేక ఐత్సరములు గడచినతరువాత, దానకర్ణుడను ప్రఖ్యాతిగాంచి, వాఙ్మయములకు రాజపోషకుడుగా నుండిన శ్రీ. కాశీనాధుని నాగేశ్వరరావు వంతులు గారు మిగిలియుండిన కార్యము పూర్తి చేయుటకు ప్రయత్నించి రేకొని, వా రేమాత్రమును ఇందులో జయము గాంచకపూర్వమే, వీరును మృతులైరి. ఇట్లగుట, ఆ యాంధ్రవిజ్ఞానసర్వస్వము యొక్క భవిష్యత్తు ఏమికానున్నదో తెలియ కున్నది. ఇంతకును అ గ్రంథమునకు 'భవిష్యత్తు' అని ఒకటి, కలదో లేదో అనుమానమే, ఆ విజ్ఞానసర్వస్వము వివిధవిషయములలో పండితులైన మేధావులచే వ్రాయబడి శ్రీ లక్ష్మణ రావుగారి సంపాదకీయత క్రింద తయారు కాబడుటకు నిశ్చయింపబడి యుండెను. అట్టిపరస్పర సహా యావలంబనములచే ప్రయత్నింపబడిన యుద్యోగములు అనుకున్నంతటి విజయములు పొందజాల కుండుట కడు విచారకరము! అట్టి ప్రయత్నములలో, అమిత ధనవ్యయమును కాలహరణమును ప్రాప్తించుచున్నవి. శ్రీ పిఠాపురము రాజాగారు చాల ధనమువ్యయ మొనర్చి ప్రయత్నించిన తెనుగు నిఘంటువు - ‘సూర్య రాయాంధ్ర నిఘంటువు' కూడ ఈ స్థితిలో నేయున్నది. ఇప్పటికిని ఆ నిఘంటువు యొక్క ఒక్క భాగమే ప్రచురింపబడినది. కాని మిగిలిన భాగము పూర్తి యయి ఎంతత్వరలో ప్రచురింప బదునో తెలియనవకాశము కాన రాకున్నది. శ్రీపిఠాపురము రాజా వారి పావుననుండుటను,ఇయ్యది జయ ప్రదముగా రావచ్చును, అటుగాక, ఒక్కొక్క వ్యక్తిచే సాధారణమగు ఖర్చు వెచ్చములకు లోబడి సరియైన కాలములో కూర్పబడి, ప్రచురింపబడిన తెలుగు నిఘంటువులకు దృష్టాంతము ఆంధ్రశబ్ద రత్నాకరమే. అయ్యది సమకూర్చిన కీ॥శే॥ బహుజనపల్లి సీతారామాచార్యులుగారు గొప్ప పండితులు, పాండిత్యములో వారికిగల నేర్పరితనమునకును, ఓపికకును మించినవారు మరియొకరు లేరు. ఆతని నన్నివిధముల సనుసరించువారు "ఆంధ్రవాచస్పత్యము” రచించుచున్న శ్రీ కొట్ర శ్యామల కామశాస్త్రిగారు, వీరి గ్రంథము అత్యల్పకాలములోనే పూర్తికాగలదని వినుచున్నాము.