పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో వ్రాయబడిన ఈ విజ్ఞానసర్వస్వము, లేక శ్రీ వారిచే నామకరణము చేయ బడిన "ఆంధ్రవిజ్ఞానము” అను ఈ గ్రంథరాజమును గూర్చి, ఒకటి రెండుమాటలు నేను వ్రాయక పూర్వమే, శ్రీవారు రచించిన పూర్వగ్రంథములం దీ క్రింద నుదాహరింపబడిన ముఖ్యమైన వాటిని గూర్చి కొంచెము ప్రసంగింతును. (౧) సీమంతినీపరిణయము ఇదియొక మహాప్రబంధము- ఇందు సోమవార వ్రతమాహాత్మ్యము వర్ణింపబడినది. (అ) వీధినాటకము మహాకవి శ్రీనాథుని వీథినాటకము ననుసరించియుండును. (3) మాతులనుతో ద్వాహము ఇదియొక ప్రేమగాధ. (d) ప్రబోధ జ్ఞానమునకును, మూర్ఖత్వమునకును జరిగిన సమరము. సాంఘికాచారములపై వ్రాయ బడిన ప్రహసనము— ఆంధ్రవిజ్ఞానము.——ఇది ఈ క్రింద వివరించిన గుణరత్న పంచకములచే విరాజిల్లుచున్నది. (౧) ఇదివరకే వివరింపబడిన విధముగా, ఈ గ్రంథము పలువురు మేధావులచే వ్రాయబడి సంపుటీకరింపబడినదికాదు. ఒక్క కవిశేఖరునిచే ఆదినుండి అంతమువరకును వ్రాయబడినది. అందు వలననే, గ్రంథక ర్తయొక్క వ్యక్తిసౌందర్యమును, ఏకత్వమును, అంచెల్లెడల వ్యాపించి యున్నది, (³) రెండవ విషయము.——ఇందు వివరింపబడిన అనంతములైన విషయములు. ఇంతకును ఒక్క వ్యక్తి, ఎంత మేధానిధియైన బాలసూర్యప్రసాదరావు బహద్దరు వారైనను, తమకడనున్న దన్న ఎంత గొప్ప గ్రంథ భాండాగార సహాయముతోనైనను, ఇంతటి విశ్వతోముఖమైన విజ్ఞానమయమగు గ్రంథరాజమును రచియింపగలుగుట, ఎంతేని ఆశ్చర్య జనకము. (3) మూడిన విషయము — పురాతన విషయములను, చారిత్రకమై-ఉత్కృష్టమై అభినవమైన విమర్శక మార్గములలో చర్చించుట —ఇందుకు నిదర్శనము, అంగిరసుని గూర్చి వ్రాసిన సరస రచనయే. మన వేదములు, పురాణములు, అందలి గాధలు, మన శాస్త్రములు, నవనాగరికతా విధానములతో, సైంటిఫిక్ అని పిలువబడే తీష్ణ విమర్శనలతో వ్రాయుట ఎంతేని మోదావహము, మతము పూర్వాచారములనుగూర్చి ప్రహసనము రచియించిన మన కవిగారు మన మనుకున్న ట్లే పైని పూర్వాచారముల పైని పూర్తిగా తమ కెంత తక్కువకాని గౌరవమున్నను, నిజమైన వేదాంత శాస్త్ర పరిజ్ఞాతయగు చరిత్ర పరిశీల నాదమునివలె విమర్శన కాలమందు తన మనో దృక్తేజమును అట్టి అజ్ఞాన మేఘములచే నావరింప బడనొల్లడు. మనకవిగా రెంతటి శివభక్తులో, అంతకన్న యెక్కువగా చరిత్రాత్మకమైనదియు, పవీనపదార్థ విజ్ఞాన, రాసాయనికాది శాస్త్రజన్య. మగు సత్యము నీ ఉపాసించుచుందురు ఆలోచనలలో వీరు భయవిదూరులు, సన్మార్గావలంబకులు.