Jump to content

పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

శ్రీ బాలసూర్యప్రసాదరావు బహద్దరు వారి ఆంధ్రవిజ్ఞానము ఇంతవరకును ప్రయత్నింప బడిన యితర విజ్ఞానములవలెగాక, జయప్రదముగా ప్రచురింపబడునని అందట ఆశయమును. ముద్రణకు పెట్టెలతో సిద్ధపరుపబడిన వ్రాతప్రతులు తయారుగానున్నవని నాకు తెలియును, గ్రంథము దాదాపుగా పూర్తి యైనది. ఇక 'ఆలస్య మమృతం విషం' అనునట్లు కాలహరణము కాకుండ త్వరగా ముద్రణ మొనర్చుటే మిగిలియున్నది. ఫ్రెంచి రాజకీయవిప్లవముయొక్క శుభోదయకాలమున జననమొందిన ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వమే విజ్ఞానసర్వస్వముల కెల్ల తలమానికము. వాల్టెయిర్, డిడిరో, డిఆలంబర్' అను మహా కవులు, ఆ గ్రంథరచనా కారణముననే ఆచంద్రార్క మైనకీర్తి వడసిరి. అందు విషయ కన్న ఉన్నతభావములే అధికముగా ప్రసంగముల కానవచ్చుచున్నవి. ఈ గ్రంథము పైని పేర్కొనబడిన మువ్వురు మహాకవులయొక్క వ్యక్తిత్వము అను “డైనామేట్" (ఒక మందుగుండ విశేషము) తో నింపబడియుండెను. అందువలన దానితో ఫ్రైంచిదేశము, ఫ్రెంచి దేశముద్వారా ఐరోపా మహా ఖండమంతయును. గజగజ వణకిపోయినదన్ను వింతగా కనుపించదు. ఫ్రెంచివిజ్ఞాన సర్వస్వమువలె అంత గొప్పదిగా మన “ఆంధ్రవిజ్ఞాన " మున్నదని నే నన జాలను గాని, ఇదికూడ వ్యక్తిత్వమను ఒకశక్తిచే పూరితమయియే యున్నది. మానవజాతి కళ్యాణమునకు తగిన సన్మార్గా దేశములనే ఈగ్రంథము ఉపలక్షించుచున్నది. ఇందలి గద్యరచనా శైలి వర్ణనాతీతమై యున్నది. ఈ పైశారణములచే శ్రీ బాలసూర్యప్రసాద విరచితమైన ఆంధ్రవిజ్ఞానసర్వస్వము (లేక బాలసూర్యప్రసాద ఆంధ్రవిజ్ఞాన సంహిత అనిన బాగుండునేమో!) అను ఈ గ్రంథము తెనుగు వాఙ్మయము ఉన్నంతకాలమును హైందవ నాగరిక తాగృహనిర్మాణములో ముఖ్యమైన భాగముగా చిరంజీవియై యుండును, వాల్తేరు. తేదీ 25-4-1939. కట్టమంచి రామలింగా రెడ్డి పైస్ ఛాన్సలర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, Vegu-Jukka Printing Works, Berhampur (Ganjam) Aug. 1939.