పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఈ దురదృష్టకరపరిస్థితిలో మాప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలనూ, సంక్లిష్టతలను సరిదిద్దవలసిన కర్తవ్యం మా మీద పడింది. గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా మనం మరొకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునాదుల నుంచి పునర్నిర్మించవలసిన పరిస్థితి ఏర్పడింది.

4. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పొందుపరచబడ్డ అవకాశాలు మొక్కుబడిగా చూపించినవే తప్ప రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్న అవకాశాలను ఏ విధంగానూ పూరించగలిగినవి కావు. కొత్త రాష్ట్రానికి అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఆదాయకల్పన, వైద్యవిద్యా సంస్థలు, పరిశోధన మరియు శిక్షణ సదుపాయాలు, మౌలిక సామాజిక సదుపాయాలు కొత్త రాష్ట్రం మనుగడకు ఏమాత్రం సరిపోగలిగినవి కావు. కొత్త రాష్ట్రం యొక్క రాజధానిని కూడా నిర్ణయించకుండా రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు.

5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి నాయకత్వం క్రింద 1995-96 లో చేపట్టిన రెండవదశ సంస్కరణలు దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు దారిద్ర్యనిర్మూలనకు, ఆర్థికాభివృద్ధి ద్వారా ఆర్థిక సంస్కరణలకు తోడ్పడ్డాయి. 90ల మధ్యకాలంలో సమాచారవిప్లవం పర్యవసానంగా భూమి, జలసంపద, అటవీ సంపదల భాగస్వామ్య నిర్వహణలో గొప్ప పురోగతి సాధ్యమయింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక బృందాలు, డ్వాక్రా సంఘాలు చేపట్టిన కృషి ప్రపంచవ్యాప్త విజయగాథగా మార్మోగింది. మహిళా సంఘాల ద్వారా సాధించిన సామాజిక గతిశీలత, సాధికారికత, సామర్థ్యకల్పన దారిద్ర్య నిర్వహణ వ్యూహంలో ప్రధానపాత్ర పోషించాయి. ఈ వ్యూహాలు ఆర్థికసంస్కరణల రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప పేరును తీసుకురావడమే కాక, దేశంలోనూ,

2