పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22. 'వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు' పథకం క్రింద నిర్ధిష్ట సమయంలోపు రుణాలు చెల్లించే రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలను మా ప్రభుత్వం అందజేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి, వడ్డీ రాయితీ పరిహారం మొత్తాన్ని బ్యాంకులకు విడుదల చేయకుండా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి, గత ప్రభుత్వ బకాయిలతో సహా 1,834 కోట్ల రూపాయలు 73.88 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రత్యక్ష నగదు బదలీ (డి.బి.టి.) విధానం ద్వారా జమ చేయడం జరిగింది. 33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

23. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వ్యాపారులతో మన రాష్ట్ర రైతులను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫారమ్ అయిన ఇ-ఫార్మార్కెట్ను ఏర్పాటు చేసింది. ఈ ఇ-ప్లాట్ఫారమ్ ను విజయవంతంగా ఉపయోగిస్తున్న రైతులు మరియు వ్యాపారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం అనేది డిజిటల్ మార్కెటింగ్ అయిన ఈ ఇ-ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు 4,000 మందికి పైగా రైతులు మరియు 2,000 మందికి పైగా వ్యాపారులు ప్రయోజనాన్ని పొందారు. అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించకుండా కాపాడుతోంది.

24. వ్యవసాయ యాంత్రీకరణ: పెట్టుబడి మరియు నిర్వహణల ఆర్థిక భారం రైతులపై పడకుండా, చిన్న మరియు సన్నకారు రైతులకు అద్దెకు ఇచ్చు పద్ధతి (హైరింగ్ మోడ్ లో, వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం గల ప్రతి గ్రామంలోను 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. హార్వెస్టర్ మరియు స్ట్రా బేలర్లు కలిగి ఉన్న సుమారు 6,525 గ్రామ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లు మరియు

9