పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి.హెచ్.సి.) లు వరి పండించే ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటుచేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం 1,212 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి

'పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉండదు' అని నానుడి.

గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు

సంతానంతో సమాన స్థాయిని పశువులకు ఇస్తూ వుంటారు.

25. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం ఒక ముఖ్యమైన రంగం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోడించిన స్థూల విలువలో 11.45 శాతం వాటాను కలిగి ఉంది. 2021-22 ఆర్థిక సం॥లో మన రాష్ట్రం, దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోను ఉంది. స్థాపించబడిన 10,778 రైతు భరోసా కేంద్రాలలో, 9,844 పశుసంవర్ధక సహాయకుల మంజూరుతో పాటు అవసరమైన మందులు, పరికరాలు, పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సంబంధిత మరియు సాధారణ సేవలు కూడా ఈ కేంద్రాల వద్ద అందించబడుతున్నాయి.

26. రైతులకు పశువుల బీమాను అందించడానికి అభివృద్ధి చెందిన మరియు స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందని పశువులు కూడా ఈ పథకం క్రిందకు వచ్చేటట్లుగా మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. పశు బీమా పథకాన్ని ప్రారంభించింది.

27. డా॥ వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవ: పశువుల సంరక్షణ కోసం రైతులు ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించడానికి మా ప్రభుత్వం 340 అత్యవసర సంచార పశు వైద్యశాలలను ప్రారంభించింది. జంతు వ్యాధుల కచ్చితమైన నిర్ధారణకు మరియు జబ్బు పడిన జంతువుల సత్వర చికిత్స కోసం వినియోగించే రైతుల వనరులను ఆదా చేయడానికి డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలతో అనుసంధానం అయ్యేటట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణా కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి.

10