పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం క్రింద, చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. చమురుపై సబ్సిడీని లీటరుకు సుమారు 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. అంతేగాక చనిపోయిన ప్రతీ మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్ష రూపాయలకు పెంచింది. 61,682 రొయ్యలు మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నును యూనిట్ రేటుకు రూ.6.89 పైసల నుండి రూ.1.50 పైసలకు తగ్గించడం జరిగింది.

29. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి 9 చేపలు పట్టే ఓడ రేవుల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశ క్రింద ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం మరియు జువ్వలదిన్నె ఓడ రేవులు నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వోడరేవు మరియు కొత్తపట్నంలలో మిగిలిన 5 చేపలు పట్టే ఓడ రేవులు రెండవ దశలో చేపట్టనున్నాము. అలాగే, మంచినీలపేట, చింతపల్లి, భీమిలి మరియు రాజయ్యపేటలలో బెర్త్ మరియు పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం చేపట్టబడింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

30. మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో 4,24,07,705 మంది లబ్దిదారులు ఉన్నారు. ఫిబ్రవరి 2021 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకుల చేరవేతను ప్రవేశపెట్టినప్పటి నుండి లబ్దిదారుల సంఖ్య 84 శాతం నుండి 94 శాతంకి పెరిగింది.

31. దరఖాస్తుచేసిన 21 రోజులలో కొత్త కార్డులను గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటివరకు 48,75,906 దరఖాస్తులు ఈ విధానం ద్వారా పరిష్కరింపబడ్డాయి.

32. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద సార్టెక్స్ విధానం ద్వారా సేకరించబడిన నాణ్యమైన బియ్యాన్ని జనవరి 2021 నుండి పంపిణీ చేయడం ప్రారంభించింది. రక్తహీనత,

11