పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూక్ష్మ పోషక లోపాల సమస్యలను పరిష్కరించడానికి మరియు పోషకాహార లోపాల్ని తగ్గించడానికి ఇనుము, విటమిన్ బి-12 మరియు ఫోలిక్ యాసిడ్లతో సమృద్ధిగా ఉన్న బలవర్ధక బియ్యం పంపిణీని మొదటి సారిగా ఏప్రిల్, 2020 నుండి విజయనగరం జిల్లాలో మా ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత ఈ పథకాన్ని జూన్ 2021 నుండి సమగ్ర శిశు అభివృద్ధి పథకం మరియు మధ్యాహ్నం భోజన పథకాలకు కూడా విస్తరింప చేసింది. 2022 ఏప్రిల్ నుండి ఎక్కువ ఆవశ్యకత కలిగిన ఏడు జిల్లాలకు పూర్తిగా ఈ పంపిణీని విస్తరించడం జరిగింది. 2023 ఏప్రిల్ నుండి అన్ని జిల్లాలకు విస్తరింపచేసే విధంగా ప్రణాళిక చేయబడింది.

33. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు 3,725 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

బి. మానవ సామర్థ్య పెంపు మరియు సాధికారత

శిశు సంక్షేమం మరియు మహిళా సాధికారత

లూయిస్ పాశ్చర్, ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు సూక్ష్మ జీవ శాస్త్రవేత్త కూడా. ఇతని పరిశోధనలు టీకాల ఆవిష్కరణకు పునాదులుగా ఉపయోగపడ్డాయి. వీరు ఒకసారి ఇలా అన్నారు.

'నేను ఒక పిల్లవాడిని కదిలించినప్పుడు,

అతను నాలో రెండు భావాలను ప్రేరేపించాడు -

అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వం మరియు

అతను ఎలా మారవచ్చో దానిపట్ల గౌరవం.'

34. మన రాష్ట్రంలో పిల్లలు, మహిళల శ్రేయస్సు మరియు వారి పోషకాహార అవసరాలు తీర్చడం కోసం 257 సమగ్ర శిశు అభివృద్ధి పథకాలకు సంబంధించిన (ఐ.సి.డి.ఎస్.) ప్రాజెక్ట్ లు, 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7,15,000 మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు 6 నెలల నుండి 72 నెలల మధ్య వయస్సు గల 25,76,000 మంది పిల్లలలో

12