పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తహీనత మరియు పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం కోసం వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం క్రింద రోజూ ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు పోషకాహార కిట్, పాలు, గుడ్డు అందజేస్తున్నాము. 35. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సమీపంలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అంగన్వాడీ కేంద్రాలు వై.ఎస్.ఆర్. ప్రారంభ ప్రాథమిక పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలలో ప్రిపరేటరీ తరగతి, 1వ తరగతి మరియు 2వ తరగతి ఉంటాయి. ఇవి విద్యకు పునాదివేసే పాఠశాలలుగా పిలువబడుతున్నాయి.

ఆరోగ్య సంరక్షణ మరియు పోషకాహారం

36. కోవిడ్ అనంతర ప్రపంచంలో, ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే సంవత్సరాలలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ విషయంలో, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుండి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతోపాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు మరియు శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

37. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద 108 సేవలను, 104-సేవలను మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల క్రింద తగిన కేటాయింపులు చేయబడ్డాయి. మా ప్రభుత్వం వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యలలో భాగంగా మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకు వెళుతోంది. అనారోగ్య సమయాలలో రోగులు ప్రయాణించాల్సిన అవసరం లేదని మరియు తదుపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ OP, అంటు వ్యాధులు

13