పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు మరియు తరువాత సంరక్షణకై మరియు మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వైద్యులు సేవలు అందిస్తారు. ఈ వైద్యులు 104-MMU వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వై.ఎస్.ఆర్. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను (విలేజ్ హెల్త్ క్లినిక్ లను) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు.

38. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స మరియు నివారణ విధానాలను 2,446 నుండి 3,255 కి మా ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా క్రింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు 5,000 రూపాయలు అందించబడుతుంది.

జగనన్న గోరుముద్ద

'ఆహార దోషము విజ్ఞాన నాశనమునకు మూలము' అని పెద్దలు చెప్పారు.

39. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మరియు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా, మా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచటం ద్వారా జనవరి 2020 నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం (ఆర్.డి.ఎ.) కంటే కూడా ఎక్కువ పోషక విలువలతో కూడిన ఐదు గుడ్లు, మూడు వేరుశెనగ బెల్లం అచ్చులు మరియు 15 ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు ప్రతీ వారం అందించబడుతున్నాయి. ఇవి సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. మా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేస్తోంది.

14