పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 15,882 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

మహిళా సాధికారత

మహిళలు స్ఫూర్తి ప్రదాతలు;

అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు;

ప్రకృతికి మరో రూపాలు;

మహిళలు మహిలో నడయాడే ఆది పరాశక్తులు.

మా ప్రభుత్వ విధానంలో మహిళా సాధికారత ఒక ప్రధాన లక్షణం.

జగనన్న పాల వెల్లువ

41. మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా, మహిళా పాడి రైతులను ఏకీకృతం చేయడానికి అదేవిధంగా వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను (ఎం.డి.ఎస్.ఎస్.) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్ట్ ను అమలులోనికి తీసుకువచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. దళారులను తొలగించి పాడి రైతుల నుండి నేరుగా సుమారు 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించడం జరిగింది. ఈ విధానం వలన పాడి రైతులకు పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు 5 రూపాయల నుంచి 20 రూపాయలు వరకు మెరుగైన ధర ఇప్పుడు లభిస్తోంది.

వై.ఎస్.ఆర్. ఆసరా

42. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. గ్రామీణ మరియు

15