పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టణ ప్రాంతాలలోని 78.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. ఆసరా పథకం యొక్క 4వ విడత కోసం 6,700 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ

43. సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించబడ్డాయి. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. చేయూత

44. ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

16