పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ. జీవనోపాధి

16. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సుమారు 62 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నందున ఈ రంగాన్ని మన ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అందువలననే, వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్.- కిసాన్, డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా-ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డాక్టర్ వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు, డాక్టర్ వై.ఎస్.ఆర్. పొలం బడి వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువుల మరియు పరికరాలపై రాయితీలు మరియు వ్యవసాయ యాంత్రీకరణ వంటి కార్యక్రమాల ద్వారా ఈ రంగంలో ఉత్పాదకత మరియు ఆదాయాలను పెంపొందించడంపై మా ప్రభుత్వం తిరుగులేని దృష్టి పెట్టింది.

డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్. కిసాన్

భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు.

వీరు అత్యంత శక్తి మంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు

-థామస్ జెఫెర్సన్

అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వం ఇది.

నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే ప్రభుత్వం ఇది.

రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వం ఇది.

17. మే నెలలో వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి, అక్టోబర్ నెలలో వారి పంటలను పండించుకోవడానికి మరియు జనవరి నెలలో ఇతర వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడానికి వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎమ్.కిసాన్ పథకం నిధులతో కలిపి మూడు విడతలలో 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో మా ప్రభుత్వం అందజేస్తోంది. వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకుగాను, కౌలుదారులకు మరియు అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన

6