పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసుకురావడం; 15,715 పాఠశాలలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వై.ఎస్.ఆర్. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు 461 వై.ఎస్.ఆర్. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం; 30.65 లక్షల ఇంటి స్థలాల పట్టాల పంపిణీ; 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం; జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం; 5.2 లక్షల ఇ-లెర్నింగ్ పరికరాల (ట్యాబ్ ల) పంపిణీ; సి.బి.ఎస్.ఇ. అనుబంధంతో ఇంగ్లీషు మీడియం విద్య, జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 9,249 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్సుమెంట్; వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద స్వయం సహాయక సంఘాలకు ఋణాల రీయింబర్సుమెంట్ నిమిత్తం 19,133 కోట్ల రూపాయలు జమ చేయడం; వై.ఎస్.ఆర్. చేయూత పథకం క్రింద 14,129 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం; జగనన్నతోడు పథకం క్రింద 2,470 కోట్ల రూపాయల ఋణాల మంజూరు; వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం క్రింద 1.41 కోట్ల కుటుంబాలకు వర్తింపు; వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద 971 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం; 56 సామాజిక సంక్షేమ కార్పోరేషన్ల ఏర్పాటు; 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, 104-అంబులెన్స్ల సంఖ్యను పెంచడం; సంక్షేమ పింఛన్లను నెలకు 2,750 రూపాయలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టగలిగాము.

11. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు యంత్రాంగంలో సమూల మార్పులను గమనించవచ్చు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా, ప్రభుత్వం నేరుగా 21 రకాల వివిధ పథకాల క్రింద రాష్ట్రంలోని అర్హులైన లబ్దిదారులందరి బ్యాంకు ఖాతాలలోకి నగదును జమ చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదలీ పథకంను అమలుచేసేందుకు మా ప్రభుత్వం 1.97 లక్షల కోట్ల రూపాయలను ఇంత వరకు విడుదల చేసింది. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ప్రత్యక్ష నగదు బదిలీ విధానము సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలులో ఒక అద్భుతమైన నమూనాగా నిలిచింది. ఈ విధానం సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను పూర్తిగా నివారించి అర్హులైన వారందరికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా, పారదర్శకంగా మరియు ప్రభావవంతమైన పద్ధతిలో సంక్షేమ చర్యలు అందేలా పని చేస్తుంది.

4